Breaking: దేశం మొత్తం లాక్ డౌన్ పొడిగింపు

May 30, 2020

ఊహించినదే జరిగింది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగించారు. మరో రెండు వారాల పాటు... అంటే మే 31 వరకు లాక్ డౌన్ పొడగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

ఈ లాక్ డౌన్ పొడిగింపు ఎవరికీ సర్ ప్రైజ్ కాదు. ఎందుకంటే ఇప్పటివరకు అన్ని రికార్డులను చెరిపేస్తూ ఈరోజు దేశంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. 5 వేల కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. ఇదే ఇప్పటివరకు రికార్డు. ఎక్కడో రష్యా, ఇటలీలో 4 వేలు కేసులు వస్తే భయం ఫీలయైన మనం ఇపుడు మనవద్దే రోజుకు 5 వేల కేసులు చూస్తున్నాం.

దీంతో కేంద్రం లాక్ డౌన్ పొడగించింది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ స్తంభించకుండా సడలింపులు ఇవ్వనుంది. కొద్దిసేపట్లో సడలింపుల వివరాలు కూడా కేంద్రం ప్రకటించనుంది.