ఏపీలో ఆ రెండు జిల్లాలు లాక్ డౌన్ 

August 10, 2020

అనంతపురం - ప్రకాశం జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్లు లాక్ డౌన్ ప్రకటించారు. ప్రకాశం కార్పరేషన్ పరిధిలోని ప్రాంతమంతా 14 రోజులు లాక్ డౌన్ ప్రకటించగా... అనంతపురం జిల్లాలో 7 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు.

అనంతపురం జిల్లా :

జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆదివారం నుంచి లాక్ డౌన్ అధికారికంగా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా ఎస్పీ ఏసుబాబు తెిపారు. ముందుగా అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, యాడికి, హిందూపురం, కదిరితో పాటు కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ప్రకటించారు.
అనంతపురం కార్పొరేషన్ పరిధిలో ఉదయం 6 నుంచి 11 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడుస్తాయి. ఫుడ్ ఆన్ లైన్ డెలివరీ మాత్రమే ఉంటుంది.  మాంసం దుకాణాలు ఆదివారం పూర్తిగా బంద్. వారం తర్వాత పరిస్థితులు బట్టి నిర్ణయం. 

ప్రకాశం జిల్లా :

జిల్లాలో కార్పొరేషన్ ప్రాంతం మొత్తం 14 రోజుల పాటు లాక్ డౌన్లో ఉండనుందని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంటే నగరం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు కలెక్టర్ పోల భాస్కర్. ఆదివారం నుంచి లాక్ డౌన్ మొదలవుతుంది.