జగన్ లాజిక్ ను బయటపెట్టిన లోకేష్

July 04, 2020

రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్ల సంఖ్య 6 లక్షల 63 వేల మంది

ఆటోకు పదివేలు చొప్పన ఇస్తే ప్రభుత్వం మంజూరు చేయాల్సిన నిధులు 663 కోట్లు.

ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు 400 కోట్ల రూపాయలు మాత్రమే.

మరి మిగతా 263 కోట్లు ఎందుకు ఇవ్వలేదు? 

ఇది లోకేష్ ప్రభుత్వానికి వేసిన ప్రశ్న. నిజమే కదా. ప్రతి ఆటోకు పది వేలు ఇచ్చే ఉద్దేశం జగన్ కు ఉంటే... 663 కోట్లు నిధులు మంజూరు చేయాలి. అలా చేయలేదు అని అంటే... దాని అర్థం షరతులు పెట్టి కోతలు విధించిమని చెప్పకనే చెప్పినట్లు. మరి బాస్ చెబితే అధికారులు ఊరుకుంటారా... సవాలక్ష రూల్స్ పెట్టారు. జగన్ ఐడియా దెబ్బకు... ఆ 400 కోట్లలోనూ కొంచెం డబ్బులు మిగిలే అవకాశం కనిపిస్తోంది. దీని గురించి ప్రభుత్వాన్ని నిలదీశారు లోకేష్ నారా. 

ఎందుకయ్యా ఇలా సామాన్యుల్ని మోసం చేస్తారు? మ్యానిఫెస్టోలోనేమో ప్రతి ఆటో అన్నకు పదివేలు ఇస్తానని చెప్పి.. ఈరోజు ఆ సర్టిఫికెట్ ఉండాలి, ఆ కులం ఈ కులం అయిండకూడదు, సొంత ఆటో ఉండాలి అంటూ అడ్డదిడ్డంగా వాదిస్తారని లోకేష్ నిలదీశారు. ఈ నిబంధనలు మ్యానిఫెస్టోలోనే పెడితే... నీకు ఓటు వేయరమో అని భావించావా అని జగన్ ను నిలదీశారు నారా లోకేష్. ఈ పథకానికి వైఎస్సార్ వాహన రక్ష పథకం అని పెట్టారు... కానీ వైఎస్సార్ వాహన కక్ష అని పెడితే సరిగ్గా సరిపోయేది అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.