జగన్ నెక్స్ట్ మూవ్ ఏంటో చెప్పిన లోకేష్ 

February 21, 2020

జగన్ రెడ్డి... ప్రజలను మోసం చేయడంలో ఆరితేరిపోయారని తెలుగుదేశం నేత నారా లోకేష్ విమర్శించారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం అన్నీ అబద్దాలే చెప్పారని లోకేష్ ఎద్దేవా చేశారు. పెన్షన్ విధానం రద్దు చేయలేమని తెలిసినా ఆ హామీ ఇచ్చారని, అమరావతి మార్చను అని హామీ ఇచ్చారని... పోలవరం కడతారని హామీ ఇచ్చారని... ఇలా వీలైనన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలను వేధించడానికి ప్రణాళికలు రచిస్తున్నారని లోకేష్ విమర్శించారు. 

ఎన్నికల ప్రచారంలో పెంచుతూ పోతాను అని చెబితే సంక్షేమ పథకాలు పెంచుతాడు అని అనుకున్నామని కానీ... ధరలు పెంచుతాడని ఊహించలేదన్నారు. వచ్చిన వెంటనే లిక్కర్ రేటు పెంచారు. ఆ తర్వాత ఆర్టీసీ టిక్కెట్ రేట్లు పెంచాడు. ఇపుడు తాజాగా పెట్రోలు డీజిలు రేట్లు పెంచాడు అని చెప్పిన లోకేష్... అతిత్వరలో జగన్ విద్యుత్ ధరలు పెంచుతాడు మనం ప్రిపేర్ కావాలి అని లోకేష్ ఎద్దేశా చేశారు. అభివృద్ధి పనులు చేసి, పరిశ్రమలు తెచ్చి సంపద సృష్టించమంటే... అది చేతకాక ప్రజల జేబుల్లో సంపద లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 

ప్రజలపై ముఖ్యమంత్రి జగన్ ఇలా ఛార్జీల భారం వేయడం సరికాదని హెచ్చరించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కునే ప్రయత్నాలు చేస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు లోకేష్. జగన్ భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచుతాడని లోెకేష్ చెప్పడం సెటైర్ కాదు... అది నిజంగానే త్వరలో జరగబోయే కార్యక్రమం. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా కుదేలైంది. ఈ నేపథ్యంలో జగన్ కు ఉన్న ఒకే ఒక అవకాశం పన్నులే. ఇపుడు వాటి మీద మీద పడ్డాడు. 8 నెలలకే తన తుగ్లక్ చర్యలతో ప్రజలకు చుక్కలు చూపిస్తున్న జగన్... విద్యుత్ చార్జీలు పెంచితే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు ఎదుర్కోకతప్పదు.