ఏమనుకుంటే.... జగన్ అదే చేశాడు - నారా లోకేష్

February 22, 2020

కనుమరుగైన ఫ్యాక్షనిజం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ మొలకలు వేసింది. తాజాగా గతంలో ఎన్నడూ లేనంత దారుణ హత్య జరిగింది. కర్నూలు జిల్లా కొలిమి గుండ్ల మండలం బెలుం గుహల వద్ద టీడీపీ నేత సుబ్బారావుని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కత్తులతో నరికి, తలపై బండలతో మోది మరీ చంపారు. 

దీనిపై నారా లోకేష్, చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. జగన్ నైజం క్రూరత్వం, ఆయన పాలన పైశాచికత్వం, అనడానికి ఇంతకన్నా ఏం కావాలి? శాంతి భద్రతలపై అసెంబ్లీ సాక్షిగా జగన్ మాట్లాడుతున్నపుడే ఈ ఘోరం జరిగింది.... ఆయన పాలనలో ఇలాంటివి జరుగుతాయని ఊహించిందే. అదే జరిగింది. 

జగన్ ది అరాచక పాలన అంటూ చంద్రబాబు విమర్శించారు. పాలన చేతగాక... కార్యకర్తల పోషణ కోసం  ప్రజధనాన్ని వాడుకుంటూ హత్యారాజకీయాలను, ప్రతీకార రాజకీయాలను జగన్ ప్రోత్సహిస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు.