అరె... లోకేష్ దెబ్బకు మంత్రి పలాయనం

May 26, 2020

ఈరోజు శాసన మండలిలో శాసనసభలో రెండింటిలో పలు అంశాలపై వాడి వేడి చర్చ జరిగింది. అయితే, నిధుల మళ్లింపు అంశంపై ఏపీ మంత్రులు మాట్లాడుతూ గత ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. గతంలో ఎడా పెడా నిధులు మళ్లించారని, బ్రిటీష్ కౌన్సిల్‌కు ఏడు కోట్లు, జ్ఞానబేరి కార్యక్రమానికి 5.4 కోట్లు మళ్లించారని విద్యాశాఖ మంత్రి సురేష్ ఆరోపించారు. అప్పటి మంత్రి, అధికారులు దారుణంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. ఉన్నత విద్యా శాఖ నిధులు రూ.180 కోట్లను పసుపు కుంకుమ పథకం కోసం మళ్లించారని సురేష్ ఆరోపించారు.
మండలిలో గత విద్యా శాఖ మంత్రి అయిన గంటా ఉండరు కాబట్టి గత ప్రభుత్వం తరఫున లోకేష్ స్పందించారు. పసుపు కుంకుమ మళ్లించిన నిధుల్లో తప్పేముంది అధ్యక్ష్యా... మేము వీరి అధినేతలాగా అవి మా కంపెనీలకు మళ్లించుకోలేదు. ప్రజలకు మళ్లించాం. ఈ ప్రభుత్వాలు ఉన్నది ప్రజల కోసమే కదా. వారిలా మాపై 11 ఛార్స్‌షీట్లు లేవు. 16 నెలలు జైలుకు వెళ్లి రాలేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిగతా నిధుల మళ్లింపు విషయాలు కేవలం ఆరోపణలు, వాటికి సాక్ష్యాధారాలు లేవని, ఒక మాజీ మంత్రిపై సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడం కుదరదని, వెంటనే ఈ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలని లోకేష్ కోరారు.
దీంతో కల్పించుకున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్... గత ప్రభుత్వంలో ఎట్లాంటి నాయకులు ఉన్నారంటే... మంగళగిరిని మందలగిరి అని.. జయంతిని వర్దంతి అని పలికిన వాళ్లు ఉన్నారు అని లోకేష్‌పై కామెంట్లు చేశారు. మా ప్రభుత్వాన్ని ఇలాంటి తెలుగు రాని వారికి ట్రైనింగ్ ఇప్పించాలని కోరతాం అని వ్యంగస్త్రాలు వేశారు అనిల్.
దీనిపై లోకేష్ ఘాటుగా స్పందించారు. అవును. నేను 2000 నుంచి ఫారిన్ లో చదివాను. అంతకు ముందు ఇంగ్లిష్ మీడియం. కొన్ని తెలుగు పదాలు పలకడంలో ఇబ్బందులు సహజమే. దానికి పాలనకు సంబంధం ఏంటి? మంత్రి అనిల్ చేసిన అతని వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలి. నేను మీరు చేసిన పచ్చి ఆరోపణలకు ఆధారాలు చూపించమని అడిగితే పనికిరాని ఆరోపణలు చేసి తప్పించుకుంటున్నారు ఏం మంత్రులు అధ్యక్ష్యా వీళ్లు అని లోకేష్ అన్నారు. శాసన మండలి చరిత్రలో ఇలా సమాధానం లేక తప్పించుకున్న మంత్రిగా అనిల్ కుమార్ రికార్డుల్లో నిలిచిపోతారని లోకేష్ తిప్పికొట్టారు.