చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేశారా?

October 16, 2019

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులకు భద్రతను ఏపీ ప్రభుత్వం తొలగించింది. జెడ్ ప్లస్ భద్రత ఉన్న లోకేష్ నారా భద్రతను 5+5 నుంచి 2+2 కి తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై రాజకీయ వేడి రగులుకుంది.
భద్రత తగ్గించడం అన్నది సాధారణమే కానీ... తొలగించడం అనేది అసాధారణం. గమనించాల్సిన విషయం ఏంటంటే.. భద్రత తగ్గింపు, తొలగింపు గురించి కనీసం ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేయలేదు.
మరీ అన్యాయం ఏంటంటే... విదేశీ పర్యటనలో ఉండగా... ఈ నిర్ణయం తీసుకోవడంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య అని ఆరోపిస్తున్నాయి.
వైఎస్ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉండగా, పాదయాత్రలో రోప్ పార్టీతో సహా ప్రత్యేక భద్రతను కల్పించింది ప్రభుత్వం. అది బాధ్యతాయుత ప్రభుత్వ లక్షణం.. కానీ జగన్ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేశారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.