సాయిరెడ్డిని మొదటి సారి భయపెట్టిన లోకేష్

July 07, 2020

వరుస ట్వీట్లతో ఏపీ ప్రజలను విపరీతంగా ప్రభావం చేసిన విజయసాయిరెడ్డి సక్సెస్ ఫుల్ గా చంద్రబాబును సోషల్ మీడియా ద్వారా జనాల్లో డీ గ్రేడ్ చేశాడు. సోషల్ మీడియాను అత్యంత ఫుల్ గా వినియోగించుకుని కార్యకర్తల్లో విపరీతమైన కాన్ఫిడెన్సును నింపి అందరినీ ఏకతాటిపైకి నడిపించడంలో సాయిరెడ్డి సక్సెస్ అయ్యారు. ఆయన పోస్టుల్లో అబద్ధాలు, బూతులు ఉన్నా వారి పార్టీకి మాత్రం అవి చాలా దోహదం చేశాయి. ఆధారాలు ఉన్నా కూడా సాయిరెడ్డిపై చర్యలు తీసుకోకుండా తెలుగుదేశం చాలా చులకనగా తీసిపారేసింది. అతని ప్రభావం శూన్యమనుకుంది. కానీ జగన్ కంటే సాయిరెడ్డే తమకు ప్రధాన శత్రువు, తెలుగుదేశం పార్టీని ఓడించింది సాయిరెడ్డే అని అధికారం పోయాక కానీ తెలియరాలేదు. అందుకే ముల్లును ముల్లుతోనే తీయాలని తెలుగుదేశం పార్టీ తలచింది. సాయిరెడ్డి తరహాలోనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ డిసైడ్ అయ్యింది. అయితే సాయిరెడ్డిలా అబద్ధాలు చెప్పకుండా ఆధారాలతో సహా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు లోకేష్. ఒకపుడు లోకేష్ ని పప్పు అని చెప్పిన వాళ్లే ఈ స్థాయిలో లోకేష్ వైసీపీపై అటాక్ చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు. 15 రోజులుగా లోకేష్ ట్వీట్లు తెలుగుదేశం వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుండగా... వైసీపీ వర్గాలను భయపెడుతున్నాయి. ఎందుకంటే గతంలో వారు ఆధార రహితంగా ఆరోపణలు చేసేవారు. కానీ లోకేష్ ఆధారాలతో సహా పోస్టులు పెడుతున్నారు.
తనాదాకా వస్తే గాని తెలియదు అన్నట్లు ఆ దాడితో విలవిలలాడుతున్న సాయిరెడ్డి తన భయాన్ని తన ట్వీట్లో వ్యక్తంచేశారు. సాయిరెడ్డి వేసిన ట్వీట్ ఇది.
‘‘లోకేశ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనేమో జాకీలు పెట్టి లేపుతున్నారు. తండ్రి సైగ చేసి ఉంటారు. కొత్త ప్రభుత్వం వచ్చి 5 వారాలే అయిందన్న సృహ కూడా లేకుండా ట్వీట్లతో నవ్వులు పూయిస్తున్నాడు. సీఎం కొడుకు, మంత్రి అయిఉండి మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్‌ చెల్లని కాసు అయిపోయాడు’’.
ఈ చిన్న ట్వీట్లో ఒక వాక్యానికి ఒక వ్యాక్యానికి పొంతనే లేదు. జాకీల సంగతి పక్కన పెడితే... ఆర్నెల్ల దాకా ఏమీ అనకూడదు అని నిర్ణయించుకున్న తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టింది వైసీపీనే. కార్యకర్తలను కొట్టడం, కేసులపెట్టడం, కొన్ని చోట్ల చంపడంతో తెలుగుదేశం తన రూటు మార్చుకుంది. పరిపాలన చేతికి వస్తే రాష్ట్రా పాలన గాలికి వదిలేసి తెలుగుదేశం పార్టీని ఎట్లా బ్లేమ్ చేద్దాం, ఎలా ఇబ్బంది పెడతామా అని రోజూ ఆలోచిస్తూ ఉంటే... ఆర్నెల్లు ఎవరైనా ఎందుకు ఊరికే ఉంటారని తెలుగుదేశం తన నిర్ణయాన్ని మార్చుకుంది. అంటే నిర్ణయం మారడానికి వైసీపీయే కారణం. మరి ఎవరు రెచ్చగొట్టమన్నారు అన్నది ఒక ప్రశ్న.
ఇక లోకేష్ నవ్వులు పూయిస్తున్నాడు అంటున్నాడు... లోకేష్ నవ్వులు పూయిస్తే నవ్వుకుని వెళ్లిపోవాలి... మరి కొత్త ప్రభుత్వం వచ్చి 5 వారాలే అయింది అపుడే ఇట్లా దాడిచేస్తే ఎలా అని ఏడిస్తే దాని అర్థ మేంటి? ఆ భయం ఎందుకు వచ్చింది?
ఇక మంగళగిరిలో ఓడాడు కాబట్టి లోకేష్ చెల్లని కాసు అయిపోయాడట. మరి సాయిరెడ్డి ఏమైనా ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యారా? ఆయనదీ పరోక్షంగా నామినేటెడ్ పోస్టే. అంతెందుకు విశాఖలో ఓడిన విజయమ్మ చెల్లని కాసా? సాయిరెడ్డి పాద నమస్కారం చేసిన కేసీఆర్ కూతురు కవిత కల్వకుంట్ల చెల్లని కాసా? ఎన్నికల్లో గెలుపోటములతో చెల్లని కాసులు, బంగారు కాసులు అయిపోతారా?... మాట్లాడేటపుడు ముందుకు వెనుక చూసుకోకపోతే పెద్ద ప్రమాదాలే వాటిల్లుతాయి.
అయినా పరిపాలించే వారికి అయితే 6 నెలలు హనీమూన్ నిబంధన వర్తిస్తుంది గాని... ప్రత్యర్థి పార్టీల మీద కక్ష తీర్చుకోవడానికి అధికారాన్ని దుర్వినియోగం చేసే వారి మీద, తమ కుటుంబ సభ్యుల పుట్టిన రోజు కోసం ముసలి వారి పింఛన్లు ఆపుకునే దుర్మార్గపు చర్యల మీద ఎవరికి మాత్రం మండకుండా ఉంటుంది చెప్పండి? మొత్తానికి తన బ్రూటల్ అటాక్ తో లోకేష్ సాయిరెడ్డి కొమ్ములు వంచారని చెప్పొచ్చు.