జగన్ కి షాక్ - లోకేష్ సంచలన నిర్ణయం

August 05, 2020

కొన్ని వారాలుగా తమ జీవితాలకు భరోసా కల్పించమని జర్నలిస్టులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు పట్టించుకోలేదు. అయితే, ఇటీవల కొందరు జర్నలిస్టులు కోవిడ్ బారిన పడి మరణించడంతో లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రాతినిధ్యం వహించిన మంగళగిరి నియోజకవర్గంలో జర్నలిస్టులకు భరోసా ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. 

మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని మంగ‌ళ‌గిరి, తాడేప‌ల్లి, దుగ్గిరాల‌లో ప‌నిచేస్తున్న ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాలోని 62 మంది జర్నిస్టులకు లోకేష్ ఇన్సూరెన్స్ సొంత ఖర్చులతో చేయించారు. ఇది టెర్మ్ పాలసీ. సహజ మరణానికి రూ.10 లక్షలు భీమా, ప్రమాదం వల్ల మరణిస్తే రూ.20 లక్షలు బీమా అందేలా ఈ భీమా చేయించారు. కోవిడ్‌ మరణాలకు కూడా ఇది వర్తిస్తుంది.
 
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టడంలో జగన్ ఘోరంగా విఫలం అయ్యారని లోకేష్  విమర్శించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా నివారణ చర్యలు అస్సలు లేవని... ప్రజల ఆరోగ్యం గాల్లో దీపం అయిపోయిందని లోకేష్ విమర్శించారు. వారియర్స్ అయిన జర్నలిస్టులకు ప్రభుత్వం సేఫ్టీ కిట్స్ ఇవ్వాలని, బీమా సౌక‌ర్యం క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. కోవిడ్ తో మరణించిన జ‌ర్నలిస్టు కుటుంబాల‌కు 50 ల‌క్షల ప‌రిహారం ఇవ్వాల‌ని లోకేష్ డిమాండ్ చేశారు.