​చెలరేగిపోయిన లోకేష్ ... నాలిక్కరుచుకున్న వైకాపా

October 18, 2019

ఈరోజు నిజంగా లోకేష్ డే. ఐదు రోజుల టూర్ నుంచి వచ్చీ రాగానే... కక్ష సాధింపులతో టార్గెట్ చేసిన వైకాపాకు రెండు భారీఝలక్ లు ఇచ్చారు లోకేష్. లోకేష్ పంచ్ లకు లాజిక్ లు తెలుగుదేశం అభిమానులు ఫిదా అయిపోయారు. ఒకరకంగా లోకేస్ బెస్ట్ కౌంటర్స్ లో ఇవి టాప్ లో ఉంటాయని చెప్పొచ్చు. ఆ రెండు కౌంటర్లకు వైకాపా వద్ద సమాధానం కూడా లేదు. అంటే లోకేష్ ఓటమి నుంచి త్వరగా తేరుకుని పోరాటంపై దృష్టిపెట్టినట్లు అర్థమవుతుంది.

కౌంటర్ 1
​ఒంగోలులో జరిగిన బాలిక గ్యాంగ్ రేప్ విషయంలో ప్రభుత్వ స్పందన పేలవంగా ఉంది. అయితే, ఇందులో వైకాపా కార్యకర్తలు ఇరుక్కోవడంతో ఏపీ ప్రభుత్వం ఖంగుతిన్నది. దాచేపల్లిలో ఎవరో సంబంధం లేని బాలికపై ఆఘాయిత్యం చేస్తే తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిందించింది వైకాపా. అయితే, ప్రస్తుత గ్యాంగ్ రేప్ లో వైకాపా కార్యకర్తలు ఉండటంతో ఆ పార్టీ తీవ్రమైన చెడ్డపేరు తెచ్చుకుంది. దీంతో పాటు పార్టీని రక్షించుకోబోయి కొందరు అభిమానులు తప్పు బాలికదే అన్నట్లు పోస్టులు పెట్టడంతో పార్టీకి బాగా డ్యామేజ్ అయ్యింది. ఈ పాయింట్ పై వైకాపాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు నారా లోకేష్.
’’ఒంగోలులో మైనర్ బాలికపై పాశవికంగా జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశంలోనే సంచలనం కలిగిస్తున్న ఈ దుశ్చర్యలో నిందితులు వైసీపీ కార్యకర్తలు కావడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి జగన్ గారూ, మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైంది‘‘ అంటూ చేసిన వ్యాఖ్యలతో పార్టీ నేతల దిమ్మతిరిగింది.

కౌంటర్ 2
పోలవరంలో అవినీతి చేయడం కోసమే అంచనాలు పెంచారు. ప్రాజెక్టు వ్యయం అంతకాదు అని తెలుగుదేశం ప్రభుత్వంపై వైకాపా గతంలో తీవ్రంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో రాజ్యసభలో విజయసాయిరెడ్డి పోలవరంపై లేటెస్ట్ డీటెయిల్స్ కావాలంటూ లోక్ సభలో ప్రశ్న వేశారు. దీనికి కేంద్ర జలశక్తి శాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. బ్రేకప్ తో సహా పేర్కొంది. దీన్ని అస్త్రంగా మార్చుకున్న లోకేష్ విజయసాయిరెడ్డికి, ప్రభుత్వానికి స్ట్రాంగ్ కౌంటర్ వేశారు.
‘‘తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన Rs.55,548 కోట్ల సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించడం జరిగింది. గతంలో తెదేపా ప్రభుత్వం పంపిన అంచనాలు అన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపితే, మరింక అవినీతి ఎక్కడ నుంచి వచ్చింది? అదీగాక ఎప్పుడో ఆమోదించిన విషయాన్ని మా గొప్పతనం అని వైకాపా డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదం. అవినీతికి తావు లేకుండా కేవలం ప్రజలకోసం అహర్నిశం చంద్రబాబుగారు పడ్డ కష్టానికి ఫలితం పోలవరం ప్రాజెక్టు. ఇప్పటికైనా బీజేపీ వైకాపా నాయకులు తెదేపా మీద బురదజల్లడం మాని, మిగిలిన 30% ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయటంపై దృష్టి పెడితే మంచిది’’ అంటూ వైకాపా, బీజేపీలు రెండింటికీ ఝలక్ ఇచ్చారు లోకేష్.

తెలుగుదేశం శ్రేణులు లోకేష్ నుంచి ఇలాంటి రెస్పాన్స్ నే కోరుకుంటున్నాయి. సరైన ఆధారాలతో ఇలాంటి పదునైన విమర్శలు చేసినపుడే క్యాడర్ లో పార్టీ పట్ల భరోసా, నమ్మకం కలిగి ఉంటాయి. లోకేష్ చేసిన ఈ ట్వీట్లుక హ్యాట్సాఫ్ లోకేష్ అంటూ స్పందిస్తున్నారు పలువురు పౌరులు.