జగన్ పై లోకేష్ పంచ్ వైరల్ అవుతోందే !

August 14, 2020

ప్రజలకు ఉపాధి, ఉద్యోగాలు సృష్టించే పనులు ఏడాదిలో ఒక్కటీ చేయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... మిషన్డ్ బిల్ ఏపీ అనే పేరు మీద సర్కారు భూములు అమ్ముతున్నారని విమర్శించారు. జగన్ ది మిషన్ బిల్డ్ కాదని.. మిషన్ కిల్డ్ ఏపీ అని లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  సంపద సృష్టించి ప్రజలకు పంచడం పాలకులు చేయాల్సిన పని. భూములు అమ్మి పథకాలుపెట్టడం జగన్ చేసే పని. 

ఇంత అరాచక ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదని, ఈ రెండేళ్లు భూములమ్మి పథకాలు అమలు చేస్తారు? తర్వాత మూడేళ్లు ఏమి అమ్ముతారు అని లోకేష్ ప్రశ్నించారు. బిల్డ్ ఏపీ మిషన్ భూముల వేలానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసిన నేపథ్యంలో లోకేష్ ఈ కామెంట్లు చేశారు. గుంటూరు, విశాఖల్లోని పలు భూములను విక్రయించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ వేలం ద్వారా ఈ భూముల అమ్మకాలు చేస్తారు. 

సీఎం జగన్ మీద విరుచుకుపడిన లోకేష్  ‘తల్లిదండ్రుల గొంతు కోసి చంపిన ఉన్మాది కొడుకు త‌రువాత వారికి పెద్ద గుడి కట్టిస్తానని ప్రకటించాడట. ఉన్మాది కొడుకులాగే రాష్ట్రంలో ఆస్తుల‌న్నీ అమ్మేసి ఏపీని చంపేస్తూ దానికి ''మిషన్ బిల్డ్ ఏపీ'' పేరు పెట్టారు వైఎస్ జగన్. ఆ కార్యక్రమం పేరు ''మిషన్ బిల్డ్ ఏపీ'' కాదు ''జగన్ కిల్డ్ ఏపీ''’ అంటూ చేసిన ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.