వ‌చ్చే శుక్ర‌వారం డుమ్మాకు జ‌గ‌న్ ప్లాన్ ఏంటో?

June 04, 2020

పోల‌వ‌రం ప్రాజెక్టు....ఏపీకి జీవ‌నాడి వంటిది. జాతీయ హోదా ఉన్న ఈ ప్రాజెక్టు పూర్త‌యితే..ఆంధ్ర‌ప్ర‌దేశ్...అన్న‌పూర్ణాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మారుతుంది. ఇటువంటి పోల‌వ‌రం ప్రాజెక్టు వీలైనంత త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని క‌ల‌లుగ‌న‌ని ఆంధ్రుడు ఉండ‌డు. త‌న హ‌యాంలో పోల‌వరాన్ని పూర్తి చేయాల‌ని మాజీ సీఎం చంద్ర‌బాబు కంక‌ణం క‌ట్టుకున్నారు. ఇందుకోసం అహోరాత్రులు శ్ర‌మించి నిధుల కోసం కేంద్రంతో యుద్ధం చేశారు. సోమ‌వారాన్ని `పోల‌వరం`కు కేటాయించిన చంద్ర‌బాబు సింహ‌భాగం ప‌నులు పూర్తి చేశారు. త‌మ క‌ల‌ల‌క ప్రాజెక్టు ప‌నుల‌ను చూసేందుకు సామాన్యులు కూడా క్యూ క‌ట్టారు. అయితే, నాటి ప్ర‌తిప‌క్ష నేత‌, నేటి ఏపీ సీఎం జ‌గ‌న్ మాత్రం....పోల‌వ‌రం వైపు క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. ఆ మాటకొస్తే...అస‌లా ప్రాజెక్టుకు ఏపీకి సంబంధం లేద‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రించారు. అటువంటి జ‌గ‌న్....హ‌ఠాత్తుగా పోల‌వ‌రం ప్రాజెక్టుపై ఎన‌లేని ప్రేమ కురిపించ‌డం ప్రారంభించారు. తాజాగా సీఎం హోదాలో పోల‌వరాన్ని జ‌గ‌న్ సంద‌ర్శించ‌డం వెనుక అస‌లు గుట్టును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ర‌ట్టు చేశారు.


అక్ర‌మాస్తుల కేసులో ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌తి శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని కోర్టుకు హాజ‌రు కావాల్సిందేన‌న్న సంగ‌తి తెలిసిందే. తాను సీఎం అని....త‌న‌కు వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌న్న విజ్ఞ‌ప్తిని కోర్టు తోసిపుచ్చ‌డంతో జ‌గ‌న్....కోర్టుకు వెళ్ల‌కుండా ఉండేందుకు ఏవో కుంటి సాకులు వెదుకుతున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్...పోల‌వ‌రం టూర్‌ను శుక్ర‌వారం ప్లాన్ చేశార‌ని లోకేశ్ విమ‌ర్శించారు. అందుకే ఫిబ్ర‌వ‌రి 27న పోల‌వ‌రాన్ని ప‌ర్య‌టన ఖ‌రారు చేసుకున్న జ‌గ‌న్....ఫ్రైడే ఫివ‌ర్ గుర్తుకు వ‌చ్చి...ఫిబ్ర‌వ‌రి 28కి ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. జ‌గ‌న్‌ను చూస్తే జాలేస్తోందని, శుక్రవారం వచ్చేసరికి కోర్టుకు వెళ్లకుండా ఉండేందుకు ఏం చేయాలా అని స్కూల్‌ పిల్లాడిలా సాకులు వెతుక్కోవాల్సి వస్తోందని లోకేశ్ ఎద్దేవా చేశారు. శుక్రవారం వచ్చేసరికి తాను సీఎంనని గుర్తుకు వచ్చి ఏదో పర్యటనో, రివ్యూనో పెట్టి కోర్టుకు రాలేనంటూ కబురు పంపుతుంటారని ట్వీట్స్ చేశారు.

``శుక్రవారం వస్తే చాలు, స్కూల్ పిల్లలు సాకులు చెప్పి, బడి ఎగ్గొట్టినట్టు ఉంటాయి వైఎస్ జ‌గ‌న్  గారి కష్టాలు. ప్రతి రోజు తాడేపల్లి ఇంట్లో పబ్జీ ఆడి కాలక్షేపం చేస్తూ, శుక్రవారం వస్తే తాను సీ.యం అని గుర్తుకు వచ్చి, ఏదో ఒక రివ్యూ పెట్టి, కోర్ట్ కు డుమ్మా కొడతారు. నిన్న జగన్ గారి పోలవరం పర్యటన చూస్తే, ఇదే అనిపిస్తుంది. ముందుగా 27న పోలవరం పర్యటన అన్నారు. కాని అది 28కి ఎందుకు మారిందో, నిన్న సిబిఐ కోర్ట్ లో జగన్ పిటీషన్ చూస్తే అర్ధమవుతుంది.``ప్ర‌స్తుతం జ‌గ‌న్‌పై లోకేశ్ చేసిన ట్వీట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇలా సాకులు చెప్పి అన్ని శుక్ర‌వారాలు....జ‌గ‌న్ త‌ప్పించుకోలేర‌ని....నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. వ‌చ్చే శుక్ర‌వారం డుమ్మా కొట్టేందుకు జ‌గ‌న్ ప్లాన్ ఏంటో? అని సెటైర్లు వేస్తున్నారు. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని....అపుడు ఈ శుక్ర‌వారాల టెన్ష‌న్ జ‌గ‌న్‌కు ఉండ‌ద‌ని కామెంట్స్ చేస్తున్నారు.