​ఛాన్సు దొరికితే చాలు ​రఫ్పాడించేస్తున్నాడు

October 17, 2019

తెలుగుదేశం బలం... ఆ పార్టీ నెట్ వర్క్. అది బలమైన నెట్ వర్క్ కాబట్టే అధికార పార్టీకి 151 సీట్లు వచ్చిన సమయంలోనూ 40 శాతం ఓటింగ్ తెచ్చుకుని చరిత్ర సృష్టించింది తెలుగుదేశం పార్టీ. అయితే, 2016-19 మధ్యలో ప్రత్యర్థిని బాగా లైట్ తీసుకోవడం, మంచి కార్యక్రమాలు, పథకాలు పెట్టాం కాబట్టి మళ్లీ పార్టీకి పట్టం కడతారనుకోవడం వల్ల.... కింది స్థాయి నెట్ వర్క్ లో ఏం జరుగుతుందో పార్టీ పసిగట్టలేకపోయింది. దాని ఫలితం అనుభవించింది. అయితే, ఎప్పటికపుడు తప్పొప్పులను తెలుసుకుని ముందడుగు వేయడంలో తెలుగుదేశం నాయకత్వం లక్షణంగా కనిపిస్తోంది. కేవలం నెలరోజుల్లోనే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తన విశ్వరూపం చూపిస్తున్నారు. ఇంత స్వల్పకాలంలో వచ్చిన మార్పు అని దీని భావించలేం. ఈ లక్షణం ఎప్పట్నుంచో ఉన్నా కాస్త నిర్లక్ష్యం ఆవహించి ప్రతిపక్షాన్ని గతంలో అడ్డుకోలేకపోయారు. కానీ ఇపుడు మాత్రం సీన్ వేరేలా ఉంది.
ఎక్కడ తప్పు జరుగుతుందో ఎక్కడ దొరికిపోతామో అని పాలక పక్షానికి భయం పుట్టేలా లోకేష్ రఫ్పాడించేస్తున్నాడు. ప్రభుత్వాన్ని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. తాజాగా బడ్జెట్ సెషన్స్ లో లోకేష్ ఈరోజు అనేక అంశాలపై జగన్ టీంను ఆడుకున్నాడు. ఈరోజు బడ్జెట్ పై లోకేష్ వేసిన ట్వీట్లు ప్రభుత్వానికి రెండు చెంపలు పెళపెళా వాయించేసినట్లున్నాయి.

* రైతుల వడ్డీలేని రుణాల కోసం రూ.3,500 కోట్లు ఇస్తామని @ysjagan గారు తన సొంత జిల్లాలో తమ తండ్రిగారి పేరున రైతు దినోత్సవం జరుపుతూ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అసలేమీ ఇవ్వలేదని ఒకరోజు, ఇంతే ఇచ్చిందని ఒకరోజు అన్నారు. తీరా బడ్జెట్ లో నామమాత్రంగా రూ.100 కోట్లు కేటాయించారు.
* జగన్ గారూ! మీ బడ్జెట్ కేటాయింపులే నామమాత్రమా? మీ హామీలు కూడా నామమాత్రమా? చూస్తుంటే మీరు నామమాత్ర ముఖ్యమంత్రిలా అనిపిస్తున్నారు. రైతుల వడ్డీలేని రుణాలకు రూ.3,500 కోట్లు ఎందుకు కేటాయించలేదు. ఇదేనా మీ చిత్తశుద్ధి?
* @ysjagan గారూ, పథకాలకు మీ పేర్లు తగిలించుకుని మురిసిపోతున్నారు సరే. అమ్మఒడిలో లబ్దిపొందే తల్లుల సంఖ్యను సగానికి తగ్గించడం ఏంటి? ఒక తల్లికి ఇచ్చి, ఇంకో తల్లికి ఇవ్వకుండా స్కిప్ చేసుకుంటూ, జంపింగ్ జపాంగ్ ఆటలాడతారా? పథకానికి కూడా 'జగనన్న జంపింగ్ జపాంగ్' అని పేరు పెడితే బాగుండేది.
* ఆర్థికమంత్రిగారు రామాయణమంతా చదివారు, సంజీవని గురించి చెప్పారు. వైద్య ఖర్చులు రూ.1,000 దాటితే ప్రభుత్వమే చూసుకుంటుందని ఊదరకొట్టారు. చివరికి ఆరోగ్యశ్రీకి రూ.1,740 కోట్లు విదిల్చారు. కొండంత రాగం తీసి పాట పాడకుండా కునుకేసినట్టుంది.
* ఐదేళ్ళలో 25 లక్షల ఇళ్ళు కడతామన్నారు. పైగా గృహరుణాలన్నీ రద్దు చేస్తామన్నారు. బడ్జెట్ చూస్తే గృహ నిర్మాణానికి కేవలం రూ.8,615 కోట్లు ఇచ్చారు. @ysjagan గారూ! మీరు నిర్మిస్తామన్నది పిచ్చుక గూళ్ళు కాదుకదా.