అరెరె... ఆల్ ది బెస్ట్ జగన్- లోకేష్

August 08, 2020

వైసీపీ తీరుపై లోకేష్ మరోసారి విరుచుకుపడ్డారు. రోజుకు ఒకటి నకిలీ పోస్టు సృష్టించకపోతే మీ బతుకులు తెల్లారవు. జగన్ వేసే 5 రూపాయిల చిల్లర కోసం సొంత తల్లి పై తప్పుడు పోస్ట్ పెట్టే నీచ స్థాయికి దిగజారిపోయింది వైకాపా పేటిఎం బ్యాచ్ అంటూ లోకేష్ వైసీపీ నేతలు, కార్యకర్తల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అనూష ఉండవల్లి అనే ఒక టీడీపీ కార్యకర్త ఇటీవల ట్విట్టరులో యాక్టివ్ గా ఉన్నారు. వైసీపీ పాలనపై డీసెంట్ గానే గట్టి విమర్శలు చేస్తున్నారు. ఆమె విమర్శలపై వైసీపీ ఎంపీ కేసు కూడా పెట్టగా సీఐడీ నోటీసులు ఇచ్చింది. 

నోటీసులు ఇచ్చినపుడు కూడా సంతోషంగా వాటిని స్వీకరించిన అనూష ఉండవల్లి ని చూసీ వైసీపీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. కేసుపెడితే భయపడతారు అనుకుంటూ నోటీసులు తీసుకుంటూ అంత సంతోషంగా ఉందేంటి అని పెద్ద చర్చే జరిగిందట వైసీపీ సోషల్ మీడియా విభాగంలో.
 
కేసుల యాంగిల్ వర్కవుట్ కాకపోవడంతో ఇంకో రకమైన నకిలీ దాడి మొదలుపెట్టారు వైసీపీ కార్యకర్తలు. ఆమెకు లోకేష్ సోషల్ మీడియా బాధ్యతలు అప్పగిస్తూ ప్రజలకు లేఖ రాసినట్టు ఓ మార్ఫింగ్ లేఖ తయారుచేశారు.
వాస్తవానికి అలాంటి వాటికి బహిరంగ లేఖలు రాయరు అన్న కామన్ సెన్స్ కూడా లేకుండా దానిని మార్ఫ్ చేశారు వైసీపీ కార్యకర్తలు. అది నకిలీ లేఖ అని చెబుతూ వైసీపీని ఒక ఆట ఆడుకున్నారు లోకేష్ నారా. 
 
‘‘యుద్ధం డైరెక్ట్ గా చేసే దమ్ములేని దద్దమ్మ జగన్ ఇలాంటి చెత్త పనులు చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారు’’ సంచలన విమర్శలు చేశారు. ‘‘జగన్ గారు  నన్ను బదనాం చెయ్యడానికి పడుతున్న కష్టంలో ఒక్క శాతం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెట్టినా, ప్రజలు హర్షిస్తారు. లేదు, నన్ను టార్గెట్ చెయ్యడమే మీ లక్ష్యం అయితే ఆల్ ది బెస్ట్‘‘ అంటూ వ్యాఖ్యానించారు. ఇది బాగా వైరల్ అవుతోంది.