సాక్ష్యాలతో జగన్ బ్యాచ్ నోరు మూయించాడుగా!

July 10, 2020

వైఎస్ జగన్ ఎన్నికల ముందు చెప్పిన దానికి, ఎన్నికల తర్వాత చేస్తున్న దానిక ిపొంతన లేదని నారా లోకేష్ విమర్శించారు. ఎన్నికల ముందు పెద్ద విమర్శలకు సమాధానం ఇవ్వని నారా లోకేష్ ఎన్నికల అనంతరం మాత్రం... తనపై వచ్చిన ఏ విమర్శలను తాట తీయకుండా వదలడం లేదు. సోషల్ మీడియాకే పరిమితం అయ్యాడనే విమర్శలు ఉన్నా కూడా... అక్కడి నుంచే వైసీపీ సర్కారుకు కావల్సినంత మంట పుట్టిస్తున్నాడు లోకేష్. ఈరోజు సన్న బియ్యంపై ప్రభుత్వం చేస్తున్న రాజకీయాన్ని సచిత్రంగా ససాక్ష్యంగా ఎండగట్టారు.

'ఓ స్త్రీ రేపు రా!' అన్నట్టుంటాయి వైసీపీ పథకాల కథలు. సెప్టెంబర్ 1 నుంచి సన్నబియ్యం అంటూ సంచులపై రాజన్న రాజ్యాన్ని చెక్కి మరీ ప్రచారం చేసుకున్నారు. ఆ రోజు వచ్చేసరికి సన్న బియ్యం కాస్తా నాణ్యమైన బియ్యం అయ్యాయి. సెప్టెంబర్ 1 కాస్తా ఏప్రిల్ అయ్యింది. చివరికి ఏప్రిల్ ఫూల్ అనరుకదా! 

ఇది లోకేష్ విమర్శ. సన్నబియ్యం ఇస్తామని వైసీపీ చెప్పి ఈనాడు ఆ హామీ తాను ఇవ్వలేదు అని తప్పించుకుంటోందని లోకేష్ విమర్శించారు. గతంలో సన్నబియ్యంపై ప్రభుత్వం విడుదల చేసిన ప్రచార చిత్రాన్ని కూడా జత చేసి... మీ నిర్వాకం చూడండి అంటూ కడిగేశారు. సన్న బియ్యం జనం అడగకనే మీరే హామీ ఇచ్చారు. ఇపుడు మీరే మాట తిప్పేశారు. ఇదిగో సాక్ష్యం అంటూ లోకేష్ వాటిని అటాచ్ చేశారు. దీనికి ఏం సమాధానం ఇవ్వాలో కూడా తెలియక సైలెంటుగా ఉండిపోయింది ప్రభుత్వం. ఇప్పటివరకు దీనిపై ఖండన కూడా లేదంటే... లోకేష్ విమర్శ వారిని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిందని చెప్పొచ్చు.