తెలంగాణా  ఐక్య వేదిక  అఖిలపక్షము యూకే (లండన్) 

August 03, 2020
లండన్ లో  RTC  కార్మికులకు మద్దతుగా జరిగిన  అఖిల పక్ష  మద్దతు సభ 
 
అఖిలపక్ష మద్దతు సభ  మద్దతు తెలిపి పాల్గొన్న  కాంగ్రెస్ పార్టీ , BJP   ,తెలంగాణ జన సమితి ,TDP ,జెనసేన  పార్టీ నేతలు ,YSR  CP  అభిమానులు  మరియు  తెలంగాణ  మేధావులు . 
 
కార్యక్రమం లో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా    టీజెస్  అధ్యక్షుడు కోదండ రాం,మల్కాజిగిరి  ఎంపీ  రేవంత్ రెడ్డి ,నల్గొండ  ఎంపీ కోమిటిరెడ్డి వెంకట్ ,, మాజీ మంత్రి  D  K  అరుణ రెడ్డి , మరియు RTC  JAC  నాయకులు శ్రీ అశ్వత్థామ రెడ్డి గారు  వారి సందేశాన్ని ఇచ్చి  లండన్ తరహా అన్ని దేశాల నుండి RTC  కి మద్దతు తెలపాలని పిలుపు  ఇచ్చారు . 
 
మల్కాజ్ గిరి  ఎంపీ  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ , 
 
 ఆర్టీసీ కార్మికులకు లండన్ ఎన్నారై ల మద్దతు స్ఫూర్తి తో అన్ని దేశాల్లో మద్దతు ఇవ్వాలని కోరారు , విదేశాల్లో తెలంగాణ ఉద్యమ చేసిన ఎన్నారై లు తెలంగాణ లో కష్ట కాలం లో మౌనం వహించడం తప్పు ,ఉద్యమం చేసిన ఎన్నారై లు   సామాజిక బాధ్యత తో     వారి అభిప్రాయాలూ చెప్పి ప్రభుత్వం పరిష్కార దిశా గ చొరవ తీసుకునే విధం గ ఒత్తిడి తేవాలని కోరారు 
 
నల్గొండ  ఎంపీ  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ,   లండన్ తరహా అమెరికా లో కూడా ఆర్టీసీ కి మద్దతు తెలపాలని కోరారు . ముఖ్యమంత్రి  ఆర్టీసీ కి ఇవ్వలిసిన బకాయిలు చెల్లిస్తే అనేక సమస్యలు పరిష్కరించ బడుతాయని ,ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పడం బాధాకరం అని అన్నారు . . 
 
మాజీ మంత్రి  డి కే  అరుణ రెడ్డి  మాట్లాడుతూ  నిర్బంధాలు , హౌస్ అరెస్టులు ఉద్యమ అణిచివేత తో సమస్య మరో సమస్య కి దారి తీస్తుందని ,హై  కోర్ట్ ని కూడా తప్పు దోవ పట్టించే అవసరం లేదని  ముఖ్యమంత్రి మొండి వైఖరి విడనాడాలని కోరారు . 
 
 
 
 
టీజెస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ   ముఖ్యమంత్రి పెద్ద మనుసు చేసుకొని కార్మికుల సమస్య పరిష్కార దిశా గా ఆలోచన చేయాలనీ  , పట్టు విడుపుల సమయం కాదని బలిదానాలు పెరగకుండా చర్యలు చేబట్టాలని ,అణిచివేత ధోరణి సమస్య పరిష్కారం కాదని అన్నారు 
 
ఆర్టీసీ జాక్ నాయకుడు అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ  థేమ్స్ నది ఒడ్డున  లండన్ నుండి తెలంగాణ  ఉద్యమం  చేసిన ఎన్నారైలు 
 ఆర్తి కార్మికుల పక్షాన మద్దతు తెలపడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని ,మా సమస్య కి విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారై లు మద్దతు తెలపడం  సంతోషం అని . మా కార్మిక సమస్యలు త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి ని అనేక ప్రయత్నాల ద్వారా విన్నవించుకున్నా తర్వాతే సమ్మె చేస్తున్నామని అన్నారు . 
 
లండన్ ఎన్నారై ల  ఉమ్మడి పత్రికా ప్రకటన 
 
 
నాడు తెలంగాణ ఉద్యమం లో  థేమ్స్ నది ఒడ్డున  బ్రిటన్ పార్లమెంట్ ముందు ధర్నా చేసి  కెసిఆర్ కి బాసట గ నిలిచామని  అదే కెసిఆర్  విధానాల వల్ల  పై మల్లి  ధర్నాలు చేయాలిసి రావడం దురదృష్టకరం అని అన్నారు . 
 
ముఖ్యమంత్రి  కుటుంబ పెద్ద గ  కార్మిక సమస్య పరిష్కార దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు ,
 
కార్మిక సమస్యలు దశలవారీగా  గడువు విధించి  సమస్య పరిష్కారఎం చేయాలి లేకుంటే ఆత్మహత్యలు పెరుగుతాయని అన్నారు 
 
ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వం లో విలీనం చేస్తే ఏవో కార్పొరేషన్ లు అడుగుతాని అనడం హేతుబద్దత లేదని  ఆలా అయితే తెలంగాణ ఏర్పాటు సమయం లో ఇలాంటి వాదనే వచ్చినా నిలవలేదని అన్నారు
 
ఆత్మహత్యలు ఆపాలని ,ముఖమంత్రి ఆత్మహత్యలపై స్పందించాలని  చనిపోయిన కుటుంబానికి 15 లక్షల ఆర్ధిక సహాయం ,కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని   కోరారు  
 
న్యాయ సలహా తీసుకొని ఆర్టీసీ కార్మికులకు లండన్ నుండి ఆర్ధిక సహాయం చేయాలనీ తీర్మానం చేయడం జరిగింది . 
 
హక్కుల కై అహింసా,శాంతి యుత పోరాటాలని అణిచివేయడం అప్రజాస్వామికం అని  , వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోరారు . 
 
కార్మికుల  కోసం ,కారిమికుల చేత కార్మికులే యూనియన్ లు పెట్టుకొని ప్రజాస్వామ్య బద్దం గ  ఏర్పడుతాయని యూనియలా మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నాలు మంచివి కావని  ఇదే సంఘానికి నేటి మంత్రులు కూడా  గౌరవాధ్యక్షులు గ ఉన్నారని గుర్తు చేశారు .
 
 ఆంధ్రప్రదేశ్ తరహా తెలంగాణ లో కార్మికుల్ని ప్రభుత్వము లో విలీనం చేయాలని కోరారు .  
 
 
తెలంగాణ మలి ఉద్యమం లో  పాల్గొన్న 
గంప వేణుగోపాల్ ,  పసునూరి కిరణ్ , రంగు వెంకటేశ్వర్లు శ్రీధర్ నీల ల ఆధ్వర్యం లో  6 ప్రధాన  రాజకీయ పార్టీ లు ,మేధావులు ఐక్య వేదిక గ ఏర్పడి సభ ఏర్పాటుకు ముఖ్య భూమిక గ పోషించారు . 
 
కాంగ్రెస్ పార్టీ తరపున  శ్రీ గంప వేణుగోపాల్ , శ్రీ గంగసాని ప్రవీణ్ రెడ్డి ,శ్రీ శ్రీధర్ నీలా ,శ్రీ శ్రీనివాస్  దేవులపల్లి ,శ్రీ నర్సింహా రెడ్డి తిరుపరి ,శ్రీమతి మేరీ ,శ్రీ జవహార్ రెడ్డి,శ్రీ జయంత్ వద్దిరాజు  లు
 
 
BJP పార్టీ  తరపున శ్రీ పసునూరి కిరణ్ ,ప్రవీణ్ బిట్ల  లు 
 
 
తెలంగాణ జన సమితి పార్టీ   తరపున శ్రీ రంగు వెంకటేశ్వర్లు , శ్రీ స్వామి ఆకుల ,శ్రీ రాజు గౌడ్  లు 
 
 
TDP పార్టీ తరపున శ్రీ కోటి , శ్రీ చైతన్య లు 
 
 
జనసేన పార్టీ తరపున  శ్రీ అయ్యప్ప ,శ్రీ హనీఫ్, శ్రీ అబ్దుల్ లు 
 
 
YSR  CP  పార్టీ  అభిమానులు  శ్రీ శివా రెడ్డి ,శ్రీ గణేష్  రెడ్డి లు 
 
యూకే  తెలంగాణ మేధావి  వర్గం నుండి  శ్రీ ఓరుగంటి కమలాకర్ రావు గారు , శ్రీ శ్రవణ్  గౌడ్ గారు ,డాక్టర్ విశ్వనాధ్ కొక్కొండ గారు
 
 
మేధోమధనం లో తమ సలహాలు సూచనలు ఇచ్చి ఆత్మహత్యలు చేసుకోవొద్దని  ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారం  చేయాలనీ  మరియు ఆర్టీసీ  కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలి మరియు చనిపోయిన  కార్మిక కుటుంబాలను  తక్షణమే 20  లక్షల  ఆర్ధిక సహాయం ఇచ్చి సంతాపములో ఉన్న కుటుంబాలను ఆదుకోవాలని 
లండన్ ఎన్నారై ల తరపున  తీర్మానాలు చేశారు .
 
తెలంగాణా  ఐక్య వేదిక  అఖిలపక్షము యూకే (లండన్) 
( బీజేపీ,కాంగ్రెస్ , తెలంగాణ జన సమితి, టీడీపీ , జన సేన మరియు YSR  CP  పార్టీ )