లండన్‌లో టాక్ - చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు

November 19, 2019

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్  కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి  పన్నెండు వందలకు పైగా  ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా భారత హై కమీషన్ ప్రతినిధి రాహుల్ మరియు స్థానిక హౌన్సలౌ మేయర్ టోనీ లౌకి లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అదే స్పూర్తితో రాష్ట్ర  మంత్రి కేటీఆర్‌ కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం కూడా  వేడుకలను చేనేత బతుకమ్మ మరియు దసరా గా జరుపుకున్నామని సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.
 భార‌త్ నుంచి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా  అలాయ్ - బలాయ్   కార్యక్రమంలో, చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మిని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకొని, చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ మరియు దసరా పండగ సందర్బంగా  మహిళలందరు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేశారు.
బతుకమ్మల మద్య  కాకతీయ కళాతోరణం వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆతుథులందరి ప్రశంసలందుకోవడం  జరిగింది. విదేశాల్లో స్థిరపడ్డా కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్  జోగినపల్లి  చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రజలంతా పాల్గొనాలని, ప్రవాసులంతా ఎంపీ సంతోష్ చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రసంశించడమే కాకుండా మా వంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కలిపిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ భారీ పోస్టర్ ని ఆవిష్కరించారు.
హాజరైన ముఖ్య అతిధులు మరియు  ప్రవాసులంతా "I PLEDGE TO SUPPORT #GREENINDIACHALLENGE" అనే సెల్ఫీ స్టాండ్ తో ఫోటోలు దిగి తమ మదత్తును తెలియజేశారు. గత కొన్ని  సంవత్సరాలుగా  చేనేతకు చేయూతగా మా వేడుకలని చేనేత బతుకమ్మ సంబరాలుగా చేయడం ద్వారా ఎన్నో నేతన్న కుటుంబాలకు మేలు జరిగిందని తెలిపారు. ఉద్యమ బిడ్డలుగా ప్రతి కార్యక్రమానికి సామాజిక బాధ్యతను జోడించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్నింటిని ప్రోత్సహించి విజయవంతం చేస్తున్న ప్రవాసులందరికి నిర్వ‌హ‌కులు కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ  కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు మరియు ఎన్నారై టి. ఆర్. యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం,  టాక్ అధ్య‌క్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, టాక్  ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, టాక్ జాతీయ కన్వీనర్ శ్రీకాంత్ పెద్దిరాజు, మరియు ముఖ్య సభ్యులు మట్టా రెడ్డి, వెంకట్ రెడ్డి దొంతుల,నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల,మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి,వంశీ రెక్నర్ , రంజిత్ చాతరాజు,సత్యం కంది,గణేష్ పాస్తం ,రాకేష్ పటేల్,రవి రేటినేని ,రవి ప్రదీప్ పులుసు,,సత్య చిలుముల,శ్రీధర్ రావు,వెంకీ సుదిరెడ్డి, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, జస్వంత్,వంశీ పొన్నం,
భరత్ బాశెట్టి, వేణు నక్కిరెడ్డి, హరి గౌడ్ నవాబ్ పేట్ , నవీన్ మాదిరెడ్డి, చిత్తరంజన్ రెడ్డి,సురేష్ బుడగం,మధుసూదన్ రెడ్డి,వంశీ పొన్నం  మహిళా విభాగం సభ్యులు శ్వేతా రెడ్డి,సుష్మన,జహ్నవి వేముల, సుప్రజ పులుసు,క్రాంతి రేటినేని,మమత జక్కీ ,శ్వేతా మహేందర్, ప్రియాంక, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.