టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే... మోడీకి అమ్ముకుంటాడు

August 05, 2020

లోక్‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌జ‌లు కాంగ్రెస్ ఎంపీల‌ను గెలిపించి తెలంగాణ ఇచ్చిన రుణం తీర్చుకుంటార‌ని లండ‌న్ టీపీసీసీ విభాగం అభిప్రాయ‌ప‌డింది. ఈరోజు లండన్ లో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ తిరుపతి రెడ్డి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యదర్శి వీరేంద్ర, ఐఓసీ నేతలు గురమిందర్, రష్పాల్ సంఘ పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్‌కి ఓటేస్తే తెలంగాణ‌కు ఒరిగేదేం లేదు, మీరు గెలిపించిన సీట్ల‌ను కేసీఆర్‌.. న‌రేంద్ర మోడీకి అమ్ముకుంటాడు. త‌న కూతురికి, కొడుక్కి కేంద్రంలో కీల‌క మంత్రి ప‌ద‌వులు తెచ్చుకుంటారు. బీజేపీని దించాలంటే, దేశాన్ని ర‌క్షించుకోవాలంటే... కాంగ్రెస్‌కు 17 సీట్లు ఇచ్చి గెలిపించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన రుణం తెలంగాణ ప్రజ‌లు కాంగ్రెస్ ఈసారి లోక్‌స‌భ సీట్ల రూపంలో ఇచ్చి తీర్చుకుంటార‌ని ఆశాభావం వ్య‌క్తంచేశారు. ఇప్పుడు తెరాస లో చేరిన ఎంపీలంద‌రూ క‌లిసి 15 మంది ఉన్నారు. వారు గ‌త ఐదేళ్ల‌లో ఏం సాధించారు, వ‌చ్చే ఏడాది గెలిచినా అంతే అని... కేసీఆర్ చ‌క్రం ఎక్క‌డా తిర‌గ‌దు అన్నారు. ఒక్క విభజన హామీ నెరవేర్చని కేసీఆర్‌ను ప‌క్క‌న పెట్టి 17 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలపాలని ఆయ‌న‌ కోరారు.
అనంత‌రం ఐఓసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ సచివాలయం రాకుండా ఇంట్లో టైంపాస్ చేస్తూ ప్ర‌జాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఆయ‌న పార్టీని 17 సీట్లలో ఓడిస్తే స‌చివాల‌యానికి ఎందుకు రారో చూద్దాం అన్నారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ , యూకే, ఐఓసీ ప్రధాన కార్యదర్శి గంప వేణుగోపాల్ మాట్లాడుతూ టీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుల్లో ఒక‌రైన హ‌రీష్ రావు గొంతు కోయడాన్ని బ‌ట్టే కేసిఆర్ ధోరణి ఏంటో అర్థం అవుతుంది. రేపు తెలంగాణ గొంతు కూడా కేసీఆర్ ఇలాగే కోస్తాడు. కేసీఆర్‌కి తెలిసింది.. మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలు మాత్ర‌మే అని గంప వేణుగోపాల్ విమ‌ర్శించారు.
అడ్వైసరి మెంబెర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చి 100 రోజుల అయ్యింది. ఆయ‌న ఏం సాధించారో ఒక‌సారి ఆలోచించాల‌ని అన్నారు. కొడుక్కి పీఠం క‌ట్ట‌బెట్ట‌డం ఒక్క‌టే ఆయ‌న ఇటీవ‌ల కాలంలో చేసిన ప‌ని అన్నారు. కెసిఆర్... మీరు హరీష్ రావు కి ద్రోహం చేశారా ? హరీష్ రావు మీకు ద్రోహం చేశారా ? చెప్పండి అని నిల‌దీశారు.
కో కన్వీనర్ రాకేష్ బిక్కుమండ్ల మాట్లాడుతూ పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు కి కృషి చేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధులని యువ మేధావులని గెలిపించు కోవాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డ‌మే లక్ష్యంగా పని చేయాలని అభిమానుల‌కు పిలుపునిచ్చారు. కో కన్వీనర్ శ్రీధర్ మంగళారపు మాట్లాడుతూ ఎన్నికలు కాంగ్రెస్- బీజేపీ మధ్యేనని తెరాస కి ప్రాంతీయ పార్టీ లకు ఓటు వేయడం వృథా అని, తెలంగాణ లో బీజేపీని ఎవరు నమ్మరు అని అన్నారు.
కార్యదర్శి, శ్రీధర్ నీలా మాట్లాడుతూ ఎన్నికల్లో బ్రిటన్ ఎన్నారై లు క్రియాశీలంగా పని చేస్తున్నారని వరంగల్ వాసి అయిన‌ తాను వరంగల్, మహబూబాబాద్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేస్తానని అన్నారు. మహిళా విభాగం- ప్రధాన కార్యదర్శి మేరీ మాట్లాడుతూ స్వ‌తంత్ర ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు కాంగ్రెస్ శ్రమ ఎంతో ఉందని, కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే దళిత, మైనారిటీ మహిళల‌కి రక్షణ ఉంటుందని అన్నారు.
కార్యక్రమం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ విభాగం కార్యవర్గ సభ్యులు దేవులపల్లి శ్రీనివాస్, నీల శ్రీధర్, మేరీ, రజిత, శశి, అఖిల్, వేణుగోపాల్, సుభాష్, తిరుపతి రెడ్డి, గంప వేణుగోపాల్, సుధాకర్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, రాకేష్, శ్రీధర్ మంగళారపు, స్నేహలత, వైష్ణవి, రంజిత్, ప్రకాష్ ల ఆధ్వర్యం లో విజయవంతం చేశారు.