రాముడు భారతీయుడు కాదు నేపాలీ !

August 10, 2020

పోయే కాలం వస్తే మనుషులు నోరు జారుతారు. అలాగే ఉంది హిమాలయన్ కంట్రీ నేపాల్. ఇండియా టార్గెట్ గా కొంతకాలంగా నేపాల్ కు ఆర్థిక అండను ఇస్తున్న చైనా ట్రాప్ లో పడిన నేపాల్ ప్రధాని ఇటీవల నోరు జారుతున్నారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. 

తాజాగా వంద కోట్ల భారతీయులకు మండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నేపాలీ ప్రధాని కేపీ శర్మ. భారతదేశంలో ఉన్న అయోధ్య నిజమైనది కాదని, అది నకిలీ అయోధ్య అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమైన అయోధ్య నేపాల్‌లో ఉందని వ్యాఖ్యానించారు. 

నేపాల్ పశ్చిమాన 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిర్గుంజ్‌‌కు వద్ద ఉన్న అయోధ్య అనే ఊరే నిజమైన అయోధ్య అన్నారు. సీత కూడా నేపాలీయే అన్నారు. తన అధికారిక నివాసంలో భానుభక్త ఆచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా కేపీ శర్మ ఓలీ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందు దేశం అని చెప్పుకుంటూ కమ్యూనిస్టు అని చెప్పుకునే చైనా మాటలు నమ్ముతున్న నేపాల్ ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. 

చైనా సరిహద్దు గొడవల రాకముందు సైలెంట్ గా ఉన్న నేపాల్... భారతదేశంతో శతాబ్దాలుగా సఖ్యతగా ఉంది. అసలు భారతదేశం అండ లేకపోతే ఈ హిమాలయన్ రాజ్యాన్ని చైనా ఎపుడో తన దేశంలో కలిపేసుకునేది. కానీ భారతదేశం యెక్క విశాల హృదయం వల్ల ఇంకా మిగిలి ఉన్న ఈ దేశం హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేస్తోంది.