జనం దెబ్బకు జడుసుకున్న ఏపీ సర్కారు

August 15, 2020

సెంటిమెంట్లతో పెట్టుకుని నిలబడిన మొనగాడు లేడు. ఎంత పోటుగాళ్లయినా ప్రజలకు ఆగ్రహం కల్గించనంత వరకే. ఈ విషయం కేసీఆర్ కు స్పష్టంగా తెలుసు కాబట్టే... ప్రతిపక్షాలకు యముండ అని బెదిరించే కేసీఆర్... ప్రజల విషయంలో పిల్లిలా మారిపోతారు. వినయంగా ఉంటారు. అందుకే వారి మద్దతుతో క్షేమంగా ఉన్నారు.

అయితే ఏపీ సర్కారు మాత్రం... తనకు 151 సీట్లు ఇచ్చారు కాబట్టి తాను ఏం చేసినా ప్రజలకు ఇష్టమే అనుకుని పాలిస్తున్నారు. ఆ భ్రమలు కరగడానికి సరిగ్గా ఏడాది కూడా పట్టలేదు. జనం ఓ చెంప, హైకోర్టు ఇంకో చెంప పంచుకుని ఏపీ సర్కారు రెండు చెంపలు వాయించారు. 

తాజాగా శ్రీవారి భూములే అమ్మాలని ప్రయత్నించిన టీటీడీకి మా మనోభావాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు. మీరు కేవలం శ్రీవారి ఆస్తి రక్షకులే కానీ... మీకు సర్వహక్కులు లేవు అంటూ భూములు అమ్మబోయిన టీటీడీ పెద్దలకు బుద్ధిచెప్పారు.

దీంతో ఈ పెద్దలను నియమించిన ప్రభుత్వ పెద్దలకు చలిజ్వరం వచ్చింది. అంతే... స్వామి వారితో పెట్టుకుంటే తల గర్వం తగ్గకుండా ఉంటుందా? ఉండదు. స్వామి వారు ప్రభుత్వ పెద్దలకు జ్జానోదయం చేశారు. ఠక్కున జీవో విడుదల అయ్యింది.

ఏపీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పేరున విడుదలైన ఈ జీవోలో..

శ్రీవారి ఆస్తులను ఉత్తినే అమ్మేయకుండా ఆలయాల నిర్మాణాలకు, ధర్మ ప్రచారానికి, ఇతర మత కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చా అనేది నిర్ధారించటానికి మత పెద్దలు, అభిప్రాయ నిర్మాతలు, భక్తుల వర్గం తదితర వేర్వేరు భాగస్వాములతో సంప్రదింపులు జరపండి ... అంటూ పేర్కొన్నారన్నమాట. 

గోవిందా గోవిందా !

మానవ మాత్రులైన మీకు మీ ప్రయోజనాలు రక్షించుకోవడానికి ఇన్ని ఎత్తులు తెలిస్తే

మిమ్మల్ని సృష్టించిన ఆ భగవంతుడికి ఎంత శక్తి ఉంటుంది, జస్ట్... ఉఫ్ ! అన్నాడు అంతే!