2019 : టీడీపీకి ఓటమి చేసిన మేలేంటి? - ఓ అభిమాని విశ్లేషణ

August 14, 2020

​‘అంతా మన మంచికే’ అనే పెద్దవాళ్ళ మాట కూడా నిజమేనేమో అనిపిస్తుంది. 2019లో తెలుగుదేశం ఓడిపోవటం వల్ల రాష్ట్రానికి కీడే కలిగినా, తెలుగుదేశానికి, బాబుకు ఒకరకంగా మేలే చేసింది. ఆ మేలేమిటనేవి చూద్దాం.

1  తెలుగుదేశం గెలిచుంటే, కరోనాకు బాబే కారణం అని తిమ్మినిబమ్మిచేసేవిధంగా నీలివార్తలు పులిమేవారు. కరోనా కారణంగా అస్తవ్యస్తమైన ఆర్థికపరిస్థితుల నేపథ్యంలో అమరావతిమీద కూడా ఆ ప్రభావం ఉండేది. కానీ,అదికూడా బాబు వైఫల్యం లెక్కలోవేసేది నీలిమీడియా. అధికారంలో లేకపోవటంతో ఇప్పుడు ఆ పులుముడు లేదు.​ 

2​ ​తెలుగుదేశం గెలిచి ఉంటే, ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో సమస్యల మీద, కరోనాలాంటి ఉత్పాతాల మీద అవగాహనలేని సన్నాసుల పాలన ఎంత ఘోరంగా ఉంటుందో ప్రజలకు తెలిసివచ్చే అవకాశం ఉండేది కాదు. పైగా, సమస్య తీవ్రతని అంచనా వేయటంలో బొక్కబోర్లపడ్డ భాజపాలు, వైయస్సార్లు బాబునే టార్గెట్ చేసేవి.

3​ తెలుగుదేశం గెలిచి ఉంటే, కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తానని చెప్పిన ఉత్తరకుమారుడి ఉత్త ప్రగల్భాలు మరింత తారాస్థాయిలో ఉండేవి. అధికారంలోకి వచ్చినా, వంచిన తన మెడ మరింత దించి, మోడీ ముందు మోకరిల్లుతున్న జగన్ రెడ్డి దమ్ము తెలుగు ప్రజలకు చూసే అవకాశం దొరికుండేది కాదు.

​4 ​రాష్ట్రం లోటు బడ్జెట్‌తో మొదలైనా, ప్రజల అవసరాలకి ఏనాడు లోటు రానీయకుండా పరిపాలన చేసాడు బాబు. తెలుగుదేశం గెలిచిఉంటే, సంపద సృష్టించే శక్తిమంతుడికి, ఆస్తులు అమ్ముకుతినే వ్యక్తిత్వానికి తేడా గ్రహించే అవకాశం ప్రజలకు ఉండేది కాదు. 

​5. అమరావతికి ఇప్పుడు కేంద్రం అసలు నిథులు ఇస్తున్నదా? ఇస్తుంటే, అవి సద్వినియోగం అవుతున్నాయా? వాటి యు.సి.లు ఎవరైనా అడుగుతున్నారా? గుర్తుందిగా, 2019 వరకు నిథులు అడిగిన ప్రతిసారి, యు.సి.ల పేరుతో బాబును వేధించిన మోడీ నిర్వాకం. తెలుగుదేశం గెలిచి ఉంటే, ఇంత ప్రస్ఫుటంగా తెలిసేది కాదు. 

6 ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు అర్థమయ్యేలా ఎత్తిచూపండి, ఎండగట్టండి. దన్నుగా నిలచిన కార్యకర్తలను రక్షించుకోండి. ఆత్మగౌరవం ఉన్న ఎవడూ అడుక్కు తినాలని కోరుకోడు, అందులోనూ ఆంధ్రులు. కాబట్టి, ప్రజలు కూడా త్వరలోనే కళ్ళు తెరుస్తారు. నిజాలు తెలుసుకుంటారు. ​