అదృష్టం అంటే ఎలా ఉంటుందో చూడాలని ఉందా... ?!

May 29, 2020

అదృష్టాన్ని కొలవలేం. వర్ణించలేం. ఇలా అని చెప్పలేం. కానీ... అందరూ సంతోషపడేది, సాధారణంగా ఊహించనిది ఏదైనా పాజిటివ్ జరిగితే అది అదృష్టం అనుకోవాలి. మధ్య ప్రదేశ్ లో జరిగిన అలాంటి ఓ ఘటన ఇపుడు ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. రెండస్తుల నుంచి ఆడుకుంటూ పొరపాటున కింద పడిన చిన్నారి... అనూహ్య పరిస్థితుల్లో ప్రాణాలు దక్కించుకుంది. పెద్ద గాయాలు కాలేదు. ఇదెలా జరిగిందో తెలుసా?

చాలా సినిమాల్లో హీరోలు మేడల మీద నుంచి కింద వెళ్తున్న ఇసుక లారీ మీదనో, ఏదైనా దుస్తుల లారీ మీదనో పడి ప్రాణాలు రక్షించుకుంటూ ఉంటారు. ఎంతో సెటప్ చేసిన తీగల సాయంతో మాత్రమే సెటప్ చేసే సీను అది. అంత పెద్ద లారీలో సరిగ్గా పడతామో లేదో అని అనుమానం. కానీ మధ్య ప్రదేశ్లో రెండస్థుల మీద నుంచి పడిన చిన్నారి... సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న రిక్షాలో అది కూడా కరెక్టుగా మెత్తటి సీటులోనే పడింది. పాప దక్కదు ఇంక అనుకుంటూ పరుగెత్తుకు వచ్చిన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. దేవుడే ఆ సమయానికి రిక్షా తెచ్చినట్టు... సరిగ్గా టైంకి అక్కడ పెట్టినట్టు ఉంది. లేకపోతే అంత చిన్న రిక్షాలో సరిగ్గా సీటులోనే పాప పడటం ఏంటి? స్వల్ప గాయాలతో బతకడం ఏంటి... ? ఇంతకు మించిన అదృష్టం ఏముంటుంది. ఆ దృశ్యాలు మీరే చూడండి.