సంచలనం : కరోనాకు వ్యాక్సినుంది - ఏపీ మంత్రి

June 03, 2020

ఇది జోకు కాదు, సెటైర్ కాదు... స్వయంగా ఏపీ మంత్రి చేసిన ప్రకటన. దేశాన్ని తనవైపు తిప్పుకుంటాను అని పీఠం ఎక్కేటపుడు ముఖ్యమంత్రి జగన్ వాగ్దానం చేశారు. ఇపుడు ఏపీ మంత్రి చెప్పిన మాటతో ప్రపంచమే జగన్ వైపు చూసేలా ఉంది. వ్యాక్సిన్ కోసం ఏపీకి ప్రపంచం బారులు తీరుతుందేమో మరి. కొన్ని రోజులుగా క్యూబా వైద్య సాయం కోసం ప్రపంచ దేశాలు అర్రులుచాస్తున్నాయి. ఇపుడు జగన్ కోసం అర్రులు చాస్తాయోమో. ఇంతకీ ఏంటా వ్యాక్సిన్ అనుకుంటున్నారా?

చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి, ప్రపంచానికే శాపంగా మారిన కరోనా ప్రపంచ దేశాలు ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు గానీ... ఏపీలో కరోనాను భూస్థాపితం చేసిన వ్యాక్సిన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి‘ అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ’’కొరియాలో ఒక్కడితో మొదలైన కరోనా ఇపుడు ఎక్కడికో పాకింది కథలుకథలుగా మనం వింటున్నాం అని కనిపెట్టిన జగన్... దాని మీద బ్లీచింగ్ పౌడర్ వేసి ఆరు గంటల్లో దానిని భూస్తాపితం చేసి ఉంటాడని’’ సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

మొత్తానికి జగనే కాదు... ఆయన టీం ప్రెస్ మీట్లు పెట్టినా కూడా కావల్సినంత ఫన్ దొరుకుతోంది. మరి ఈ జగన్ అనే వ్యాక్సిన్ గురించి తెలిస్తే... అన్నను మనకు లేకుండా తీసుకెళ్తాయోమోనని ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు అని కొందరు వ్యాఖ్యానించారు.