మసీదును కూల్చి స్థలాన్ని ఓనర్ కి ఇచ్చేశారు

July 08, 2020

ఇండియాలో ముస్లింలు మైనారిటీలు అన్నది పేరుకే గాని వారు ఎవరినీ చూసి భయపడటం లేదు. కానీ ముస్లిం ప్రాంతాల్లోకి పోవడానికి ఇతరులే అపుడపుడు జంకుతుంటారు. ఇది పక్కన పెడితే... శ్రీలంకలో 250 మంది ఉగ్రదాడుల్లో చనిపోయాక ముస్లింలపై స్థానికులు కొంచెం కోపంగా ఉన్నారు. అయితే, దీనిపై అక్కడి ముస్లింలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొందరు దుర్మార్గులు చేసిన పనికి మాకు ఏం సంబంధం... మేము ఈ దేశ పౌరులుగా స్వేచ్ఛగా బతుకుతున్నాం. ఎవరి వల్లనో మేము ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు.
శ్రీలంకలోని మదాటుగమ పట్టణంలో ఉన్న రెండుమసీదుల్లో ఒక మసీదును కూల్చివేశారు. అయితే, దానిని కూల్చివేసింది ఆ పట్టనంలోని ముస్లింలే కావడం గమనార్హం. 'మా పట్టణంలో ఇప్పటికే ఒక మసీదు ఉంది. మా ప్రాంతంలోని ముస్లింలకు అది సేవ చేస్తుంది. కానీ కొన్నేళ్ల కిందట మరో బృందం ఈ మసీదును ప్రారంభించింది. అందుకే వివాదాలకు కారణమైన ఈ మసీదును కూల్చివేశాం. ఆ స్థలాన్ని పాత ఓనరుకు అప్పగించాం'' అని పాత మసీదు ట్రస్టీ అక్బర్ ఖాన్ బీబీసీకి తెలిపారు. శ్రీలంక ప్రజల్లో సుమారు 70 శాతం మంది బౌద్ధులు. రెండో స్థానంలో హిందువులున్నారు. ముస్లింలు 10 శాతం మంది, క్రైస్తవులు ఏడు శాతం మంది ఉన్నారు. అంటే ముస్లిం మైనారిటీల శాతం చాలా తక్కువ. ఈస్టర్ బాంబు దాడుల తర్వాత ముస్లింల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం, లంకీయులు ముస్లింలపై ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో వారు శాంతించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఉగ్రవాద మనస్తత్వపు అతివాద ముస్లింలను వదిలించుకోవటానికి ముస్లింలు ప్రయత్నిస్తున్నారని చెప్పడానికే మసీదు కూల్చివేశారని పలువురు అంటున్నారు.