ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ !

August 13, 2020

 కాలం మారింది. ప్రజల అలవాట్లు మారాయి. కల్చర్ మీద మక్కువ ఉండటం తప్పేం కాదు. కానీ..దానికి ఒక పద్దతి పాడు అన్నది ఉండాలి. అలాంటిదేమీ లేదన్నట్లుగా ఫీలైన ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తుంటే.. అందరూ సంప్రదాయ దుస్తుల్నే ధరించాలనటం సరైనదేనా? అన్న ప్రశ్న తలెత్తే పరిస్థితి ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో నెలకొంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మధ్యన ఒక రివ్యూ నిర్వహించారు.  

దీనికి మాండ్ సౌర్ జిల్లాకు చెందిన అధికారి ఒకరు జీన్స్.. టీషర్టు ధరించి వచ్చారు. దీనిపై సీఎం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు గౌరవప్రదమైన.. సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు హుందాతనానికి నిదర్శనంగా నిలిచే దుస్తులు ధరించాలే తప్పించి.. ఇలా క్యాజువల్ దుస్తుల్లో వస్తారా? అంటూక్లాస్ పీకారు. దీనికి సంబంధించిన వార్తలు అప్పట్లో ప్రముఖంగా వచ్చాయి.

ఆ విషయాన్ని సీఎం చౌహాన్ మర్చిపోలేదన్న విషయం తాజాగా విడుదలైన ఆదేశాల్ని చూస్తే అర్థమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ తప్పనిసరిగా తాము ధరించే దుస్తుల విషయంలో నిబంధనల్ని పాటించాలని పేర్కొన్నారు. ఆఫీసులకు వచ్చే సమయంలో జీన్స్.. టీ షర్టులు ధరించకూడదని పేర్కొన్నారు. ఉద్యోగులంతా హుందాతనం ఉట్టిపడే దుస్తుల్ని ధరించాలని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్న హెచ్చరికను తాజా ఆదేశాల్లో ఉండటం గమనార్హం. తాజాగా విడుదలైన ప్రభుత్వ ఆదేశాలపై ప్రభుత్వ ఉద్యోగుల స్పందన ఏమిటన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.

Read Also

WHO : నవనాడులు కుంగిపోయే మాట చెబుతావేం సామీ!!
కలియు దాన వీర శూర కర్ణ... జయహో
కేంద్రం సంచలనం - విద్యా విద్యానంలో సమూల మార్పులు

RELATED ARTICLES

  • No related artciles found