ఇదేందబ్బాయి వైసీపీ ఇట్టా దొరికిపోయింది? 

July 05, 2020
CTYPE html>
ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మించి జనంలోకి పంపించడం... 
అది అబద్ధం అని తెలిసేలోపు పబ్బం గడిపేసుకోవడం.
ఇదే గత ఎన్నికల్లో వైసీపీ అనుసరించిన వ్యూహం. ఏ ప్రతికూల వ్యూహం అయినా ఒకసారే హిట్టవుతుంది. రాజధాని విషయంలో కూడా ఇదే వ్యూహాన్ని వైసీపీ పార్టీ అనుసరించబోయి అడ్డంగా బుక్కయ్యింది. రాజధాని అమరావతిలో నిర్మాణాలు సురక్షితం కాదంటూ మద్రాస్ ఐఐటీ నివేదిక ఇచ్చిందని వైసీపీ నాయకులు సోసల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేశారు. మద్రాస్ ఐఐటీ ఏ నివేదిక ఇవ్వలేదని వైసీపీకి కూడా తెలుసు. అయినా కూడా వాళ్ల పార్టీ రాజకీయ ప్రయోజనాలకోసం ఒక అబద్ధాన్ని అడ్డంపెట్టుకునే ప్రయత్నం. అయితే... అమరావతి రైతు కుటుంబాలు నిరక్షరాస్యులు కాదు. అక్కడున్నవారందరూ విద్యావంతులు లేదా వాళ్ల పిల్లలను బాగా చదివించిన వాళ్లు. దాంతో అమరావతి విషయంలో వైసీపీ వ్యూహాలన్నీ పటాపంచలు అవుతున్నాయి. అదే రూట్లో వారు తాజాగా తయారుచేసిన మద్రాసు ఐఐటీ నివేదిక అనే అబద్ధాన్ని కూడా పటాపంచలు చేశారు అమరావతి రైతులు.
రాజధాని అమరావతి విషయంలో వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై రైతులకు అనుమానం వచ్చింది. దీంతో వారు మద్రాసు ఐఐటీకి వైసీపీ ప్రచారం గురించి లేఖ రాశారు. దీనికి స్పందిస్తూ అమరావతి రైతులకు మద్రాస్‌ ఐఐటీ అధికారులు ఇ-మెయిల్ పంపారు. అమరావతిలో నిర్మాణాలు సురక్షితం కాదని తాము చెప్పలేదని మద్రాస్‌ ఐఐటీ స్పష్టం చేసింది. అక్కడి నేల గట్టిగా లేదని నివేదిక ఇచ్చామనడం శుద్ధ అబద్ధమని మద్రాసు ఐఐటీ పేర్కొంది. దీంతో వైసీపీ బండారం మరోసారి బయటపడింది. 
దీనిపై కొందరు మంత్రి బొత్సను నిలదీస్తే ఆయన మాట దాటేశారు. అంటే మేము అబద్ధాలు చెబుతామా ? అని ప్రశ్నించారు. చివరకు వారు అబద్ధాలే చెప్పారని స్వయంగా మద్రాస్ ఐఐటీయే చెప్పేసింది.