మహానాడు: లోకేష్ స్లిమ్ సీక్రెట్ ఇదే !

August 04, 2020

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు కమ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ షాకిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న మహానాడులో ఆయన స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. లాక్ డౌన్ నేపథ్యంలో వర్చువల్ గా మహానాడును ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యాలయానికి అతి తక్కువ మందికే చోటు కల్పించటం తెలిసిందే. అలా వచ్చిన వారంతా లోకేశ్ స్లిమ్ వెర్షన్ చూసి అవాక్కు అయ్యారు.

రెండు నెలల లాక్ డౌన్ వేళలో లోకేశ్ లో ఇంతలా మారిపోవటం ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది. లాక్ డౌన్ కు కాస్త ముందు బొద్దుగా కనిపించే చినబాబు.. ఇప్పుడు అందుకు భిన్నంగా బరువు భారీగా తగ్గిపోవటం వెనుక కారణం ఏమిటన్నది చర్చగా మారింది. భారీగా బరువు తగ్గిన లోకేశ్ ను.. ఏం చేశారు? రెండు నెలల్లో అంతలా బరువు ఎలా తగ్గారు? ఏం చేశారన్న ఆసక్తి పలువురిలో వ్యక్తమైంది.
లాక్ డౌన్ రెండు నెలలు హైదరాబాద్ లో ఇంటికే పరిమితమైన నేపథ్యంలో.. బరువు తగ్గటంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు లోకేశ్.

నైక్ ట్రైనింగ్ క్లబ్ మొబైల్ యాప్ లో చేసిన సూచనల్ని తాను తూచా తప్పకుండా పాటించినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. నిత్యం ముప్పావుగంట మొదలు గంట పాటు వ్యాయామం చేయటం.. ప్రత్యేక డైటీషియన్ చేసిన సూచనల్ని పక్కాగా పాటించినట్లు చెబుతున్నారు.

చెన్నైకి చెందిన డైటీషియన్ సూచనలు.. క్రమం తప్పని వ్యాయామంతో తాను బరువు తగ్గిన వైనాన్ని వెల్లడించారు. ఈ కారణంతోనే రెండు నెలల వ్యవధిలో ఏకంగా 20 కేజీల బరువు తగ్గినట్లుగా చెప్పారు. లోకేశ్ తాజా వెర్షన్ అందరిని ఆకర్షించటమే కాదు.. మహానాడులో హాట్ టాపిక్ గా మారారు.