అసలు విషయం అర్థం చేసుకున్న చంద్రబాబు

August 05, 2020

కరోనా సంక్షోభ సమయంలోను టెక్నాలజీని వాడుకుని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మహానాడును ఘనంగా నిర్వహించారు. చరిత్రో నిలిచిపోయే కార్యక్రమం ఇది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఇంత వేగంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం చిన్న విషయమేం కాదు. దీనివల్ల భవిష్యత్తులో రిమోట్ ప్లేసులో ఉన్న అభిమానులను క్షణాల్లో ఒక్క తాటికిపైకి ఒక అవకాశాన్ని పార్టీ అందరికీ పరిచయం చేసింది. అపజయం పొందిన ఉన్న పార్టీకి ఈ వెబినార్ మహానాడు కొత్త ఊపిరి పోసింది.  

అయితే, రెండు రోజుల పాటు జరిగిన ఈ మహానాడు వేడుక సాక్షిగా... చంద్రబాబు తాను చేసిన పొరపాట్లను నిజాయితీగా ఒప్పుకున్నారు. తెలుగు దేశం పార్టీ...  శ్రేణులను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేసిన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు... పార్టీ తరఫున గత ప్రభుత్వం ఉన్నపుడు పలు పొరపాట్లు జరిగాయని స్వయంగా అంగీకరించారు. 

వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుదాం అంటూ పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రసంగంలో అనేక అంశాలు ప్రస్తావించగా... బీసీల విషయంలో పార్టీ మేల్కొనడం ఆశ్చర్యకరం. చంద్రబాబులో మార్పును ఈ అంశం చాలా స్పష్టంగా బయటపెట్టింది. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన బీసీ వర్గాలు ప్రస్తుతం పార్టీకి దూరమయ్యారని చంద్రబాబు సంచలన వ్యాఖ్య చేశారు.  మనం కలసి పనిచేస్తూ వారిని తిరిగి అక్కున చేర్చుకుందామని, ఇందుకోసం గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుందామని నిజాయితీగా పిలుపునిచ్చారు.

బీసీల వల్ల తెలుగు దేశం పార్టీ ఈ స్థాయికి వచ్చిందని వారే పార్టీకి వెన్నెముకగా నిలిచారని అన్నారు. పార్టీ అధికారంలో, ప్రతిపక్షంలో ఎక్కడ ఉన్నా పార్టీకి రక్షణ కవచంగా నిలిచింది బీసీలే అన్నా చంద్రబాబు పార్టీ శ్రేణులకు గుర్తుచేశారు. బీసీలకు రాజకీయాల్లో  ప్రాధాన్యం కల్పించింది తెలుగుదేశం పార్టీయే అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. (ఈ విషయం ఇటీవలే కేసీఆర్ అన్నారు). టీడీపీతోనే రాజకీయాల్లో బీసీల ప్రస్తావన మొదలైందన్నారు  చంద్రబాబు.  

ఎన్టీఆర్ నుంచి తన వరకు బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి వారి రాజకీయ ఎదుగుదలకు కృషి చేశామన్నారు. తెలుగుదేశం ప్రోత్సాహం వల్లే ఎంతో మంది యువకులు రాజకీయాల్లో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారని అన్నారు.  

‘‘గత ఐదేళ్లలో టీడీపీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల పార్టీకి బీసీలు దూరమై ఉండవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం. పొరపాటు జరిగిపోయింది. ఆ నిర్ణయాలు తెలిసో, తెలియకో తీసుకున్నాం. అవి పార్టీకి బీసీలను దూరం చేస్తాయని ఊహించలేదు. ఏది ఏమైనా పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీలను తిరిగి పార్టీ దరికి చేర్చే దిశగా అడుగులు వేద్దాం’’  అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  

స్వీయ పరిశీలన ఎపుడూ మంచిదే. తప్పులు తెలుసుకున్న వారే మళ్లీ చేయకుండా ముందుకు వెళ్లి విజయాలు సాధిస్తారు. ఎవరినో దగ్గర చేసుకోవడానికి ఇంకెవరో నొచ్చుకునేలా నిర్ణయాలు ఉండకూడదు. ఇది పార్టీ అధిష్టానం గుర్తించడం ఎంతో సంతోషిన్ని ఇచ్చిందని అభిమానులు వ్యాఖ్యానించారు.

Image