సూపర్ ట్విస్ట్... మహా పీఠంపై సర్ ప్రైజ్ సీఎం

May 31, 2020

మహారాష్ట్ర రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇక్కడ సీట్లు గెలిచిన వారి కంటే... తక్కువ సీట్లు గెలిచిన వారు సంతోషంగా కింగ్ లా ఉన్నారు. నేను ప్రతిపక్షంలో ఉంటా అని శరద్ పవార్ చేసిన కామెంట్స్ ను బీజేపీ కూడా అభినందించింది. నన్ను ప్రతిపక్షంలో ఉండమని ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి దానిక ికట్టుబడి ఉంటాను అని ఆయన మార్కులు కొట్టేశారు. అయితే... ఇప్పటికీ మహా పీఠంపై సీఎం ఎవరనేది సందిగ్దంగా ఉంటూ వచ్చింది. అత్యధిక సీట్లు వచ్చాయి కాబట్టి బీజేపీ ఎవరు చెబితే వారు అవుతారు అనుకోవడానికి వీల్లేదు. మహారాజకీయం డిఫరెంటు. శివసేన మీద ఈగ వాలినా ఆరెస్సెస్ ఒప్పుకోదు. అందుకే బీజేపీ ఆపసోపాలు పడుతోంది. బీజేపీకి సొంత మెజారిటీ రాని నేపథ్యంలో సీఎం సీటు శివసేనకు వదులుకోవడానికి బీజేపీకి ఇష్టం లేదు కాబట్టి కొత్త మొహం తెరమీదకు వచ్చింది. శివసేనకు, ఆరెస్సెస్ కు సమ్మతమైన ఒక కొత్త వ్యక్తి... మోడీకి పెద్దగా నచ్చని వ్యక్తి అయిన గడ్కరీ మహారాష్ట్ర పీఠాన్ని అధిరోహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వాస్తవానికి ఎన్నికల ముందు ఏర్పడిన పొత్తు కాబట్టి ఈ పాటికి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగిపోవాల్సి ఉంది. కానీ... శివసేనకు ఆదరణ పెరిగేటప్పటికి ఆ పార్టీ మెలికలు పెట్టింది. దీందో అధికార పంపిణీ ఆగిపోయింది. అనేక మీటింగులు ట్విస్టుల నేపథ్యంలో  బీజేపీ.. శివసేన మధ్య నెలకొన్న విభేదాలు ఒక కొలిక్కి రాకపోవటంతో ఇబ్బందికరంగా మారింది. దేశంలోనే అత్యంత హిందుత్వ పార్టీ అయిన శివసేన కాంగ్రెస్.. ఎన్సీపీలతో జత కట్టేందుకు శివసేన సిద్ధంగా లేకపోవటం మరో కారణం. కచ్చితంగా ఏర్పాటయ్యేది బీజేపీ శివసేన ప్రభుత్వమే గాని పవర్ ఎవరి చేతిలో పెట్టాలి అన్నదే ప్రశ్నే. శివసేన ఈసారి ఎపుడూ లేనంత మొండిగా ఉంది.

Read Also

ఉండవల్లి శ్రీదేవి- ఎల్వీ సుబ్రహ్మణ్యం... ఈ కథేంటి? దానివెనుక సంగతేంటి?
తెలుగుభాష చచ్చిపోతోంది... కొంచెం గగ్గోలు పెట్టండయ్యా !
టీవీ నటి... ఇంత రొమాంటిక్ ఫోజులా?