మహర్షి మొదటి రివ్యూ

August 06, 2020

Maharshi movie is a special film for Mahesh Babu and his fans because it is 25th film in his cine life. Mahesh Babu first look was attracted by every one. He looks stylish and fresh in beard look. Allari Naresh playing crucial role in this film.

Cast and Crew

Lead Roles – Mahesh Babu, Pooja Hegde and Allari Naresh

Director and Writer – Vamsi Paidipally

Producers – Dil Raju, C. Ashwini Dutt and Prasad V. Potluri

Music Director – Devi Sri Prasad

Previous movies of Vamsi Paidipally (Director) – Oopiri (2016), Yevadu (2014), Brindavanam (2010), Munna (2007)

Release Date – 8th May 2019 in USA

Rating:3/5

హీరో జర్నీ ఏమోగానీ, అసలు ఎటు జర్నీ చేస్తున్నాడో సరిగ్గా తెలియక సాగిన దర్శకుడి ప్రయాణమే ' మహర్షి '.

మహేష్ బాబు ఎంట్రెన్స్,సినిమాటోగ్రఫీ చాలా బావున్నాయి.ఎప్పటిలాగానే మహేష్ బాబు అందంగా ఉన్నాడు, ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో  .  

డి.యస్.పి పాటల్లో మ్యాజిక్ తగ్గింది. ఎవెరెస్టు, నువ్వే సమస్తం పాటలు బావున్నాయి. మిగతావి మాత్రం ఇంతకు ముందు విన్నట్టే ఉన్నాయి.

హీరోని హైలైట్ చెయ్యడం కోసం మాటమాటకీ నిష్కారణంగా చెవులు చిల్లులు పడిపోయేలా వాయించిన బీ.జీ.యం మాత్రం తలనొప్పి తెప్పించింది.

ఏమీ సాధించక ముందు నుంచే హీరోని మొదటి ఫ్రేము నుంచి చివరిఫ్రేముదాకా చుట్టూ ఉన్నవాళ్ళంతా ఎందుకు ఒకటే మోసెస్తున్నారో అర్ధం కాదు.

భారత దేశంలో ఉన్నవాళ్ళని సర్ప్రైజ్ అంటూ అమెరికాలో పోగెయ్యడం డ్రమటిక్గా ఉంది. 

షర్ట్ నలగకుండా బోలెడంత మంది రౌడీలని ఒంటి చేత్తో కొట్టడం, హీరో ఫ్రెండుని మూడు పోట్లు పొడిచినా చావకపోవడం రౌడీలు మాత్రం హీరో చేతిలోఒక్క పోటుకే చచిపోవడం వంటి అతిసయోక్తులతో కావలసినంత వయోలెన్స్ ఉంది.

అసలెప్పుడూ పుస్తకమే ముట్టుకుని ఎరుగని హీరో అనాయాసంగా అత్యంత క్లిష్టమైన గణితశాస్త్ర సమస్యలు తీర్చెయ్యడం, 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆపరేటింగ్ సిస్టం మీద హీరో ఎవరికీ అర్ధంలేని, నిజంకాని స్పీచులివ్వడం ప్రేక్షకులని వెర్రివాళ్ళ కింద జమకట్టినట్టుగాఉంది.

సీ.ఈ.ఓ గా ' నన్ను ఎవరూ ప్రశ్నలు అడగడానికి వీల్లేదు ' అని శాసించి దేశం, కంపెనీ అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోవడమేంటి?

అమెరికన్ ఉద్యోగులందరూ హీరో కోసం భారతదేశంలోని రామాపురం అనే పల్లెటూళ్ళో పని చెయ్యడం ఏంటి? 

ఇండియాలో పనులన్నీ తాపీగా పూర్తిచేసుకుని, ఇష్టమయినప్పుడు మళ్ళీ పర్సనల్ ఫ్లైట్ ఎక్కి రిజైన్ చేశానని చెప్పిన అమెరికా ఉద్యోగానికి తల్లితోసహా బయలుదేరడం ఏంటి? మళ్ళీ తూచ్ ఇండియానే కావాలి అని విమానం బయలుదేరే ముందు లేచి వెనక్కి వచ్చెయ్యడం ఏంటి?

తండ్రిని గౌరవించకపోయినా కొడుకుని అద్భుతం అనే తల్లిగా జయసుధా, తింటున్న తిండి కంచం ముందు నుంచి లేచి వెళ్ళిపోయేలా కొడుకుమాట్లాడినా వాడు అద్భుతం అని నమ్మే తండ్రిగా ప్రకాష్ రాజ్, ఒక్క హీరో పైనే పక్షపాతంతో ఫోకస్ చేసే గురువుగా రావు రమేష్, 

ఫ్రెండ్ అద్భుతం అని తన కన్నతండ్రిని కూడా చంపేసుకుని జీవితాన్ని హీరో కోసం త్యాగం చేసిన స్నేహితుడుగా అల్లరి నరేష్ అందరూ కలిసి కథలోరిషిని చెరిపేసి అడుగడుగునా మహేష్ బాబునే నిలబెట్టారు. 

ఎందుకు వస్తున్నారో ఎందుకు వెళ్తున్నారో తెలియకుండా, తెర అంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్లు నిండిపోయారు. వెన్నెల కిషోర్ ఎందుకున్నాడో తెలియదు.

ఎప్పటిలాగానే విద్యుల్లేఖ వెకిలిగా ఉంది.అనన్య లక్షణంగా ఉంది.

చెప్పుకోదగిన నటన చూపింది జగపతిబాబు , రామాపురంలో ముసలి తాతా, బస్ స్టాండులో ఉన్న ముసలావిడ కొడుకు మాత్రమే.

ఒకసారి ఉంటాననీ, ఒకసారి వెళ్తాననీ, ఎవరో ఏదో అనగానే అమెరికాకి టికెట్ కొనేసుకునీ, మళ్ళీ అమ్మ ' నా కొడుకు ఎప్పటికీ ఓడిపోడు ' అనగానేఉత్తేజంతో టికెట్ కాన్సిల్ చేసుకునే హీరో పాత్ర ఎంత అసంపూర్ణంగా ఉందో అర్ధం అవుతుంది.

అల్లరి నరేష్ పాత్ర మొదట మంచి స్నేహితుడిలా అనిపించినా - కన్న తండ్రిని ఆత్మహత్య చేసుకునేలా జీవితం నాశనం చేసుకుని, ఆయన పోయాకవ్యక్తిగత బంధంతో మూర్ఖంగా గ్రామం కోసం మారణకాండకు సిద్ధపడ్డ తీరు విడ్డూరంగా ఉంది.

పూజా హెగ్డే చాలా చాలా అందంగా ఉంది. కానీ అసలు వ్యక్తిత్వం అంటూ లేని పాత్ర ఏదైనా ఉంటే అది హీరోయిన్ ది. 

ఓసారి నరేష్ వెంటా, కాదంటే మహేష్ వెంటా పడి ఎవరు జీవితంలో సక్సెస్ అయితే వాళ్ళతో అమెరికా వెళ్ళిపోయి ఇల్లు, పిల్లలు ఏర్పాటు చేసుకోవడంతన డ్రీం అంటుంది, అలాగే ప్రవర్తిస్తుంది కూడా. కష్టాలప్పుడు హీరోని వదిలేసి, గెలిచినప్పుడల్లా వచ్చి ఒక పాటలో యధావిధిగా అశ్లీల నృత్యాలు చేసివెళ్తుంది.  

అక్కడక్కడా కొన్ని డయిలాగులు, ప్రకాష్ రాజ్ కొడుకుకి రాసిన లేఖ, రామాపురం ముసలావిడ కొడుకు ఆవేశం మాత్రమే కొద్దిగా సరైన ఇమోషన్స్పండించాయి.

ఎటు వెళ్తోందో తెలియని కథ రెండున్నర గంటలు సాగాక ఉరుమురుమి మంగలం మీద పడ్డట్టు రైతుల ఆత్మహత్యల దగ్గిర ఆగింది.

మితిమీరిన హై క్లాసు అమెరికా సెట్టింగులూ, ఆంగ్ల పదాల్లో అనర్గళమైన సంభాషణలూ చూసి ఇది ఏ క్లాస్ సెంటర్సు కోసం తీసిన సినిమాఅనుకునేలోగా కథ పల్లెటూరుకి మారి హీరో, హీరోయిన్ ఎప్పటిలాగానే సర్కసులో జోకర్లలాగా రంగుల రంగుల అతుకుల గుడ్డలు వేసుకుని గెంతుతూపాటకి నృత్యం చేస్తారు. 

అన్నిటికన్నా టాప్ కామెడీ ఏంటంటే..ఇక దర్శకుడికే విసుగొచ్చినట్టు ఆఖరి పది నిమిషాల సినిమాలో అన్ని పాత్రలూ టకటక్ మనసులుమార్చేసుకుల్ని హీరో చెప్పినదానికి సరేనంటారు. భూమి, నాలుగు లక్షల డబ్బు, ఉద్యోగం అన్నీ వద్ధు అనుకుని బీద రైతులందరూ ఈ నేల మీదమీరు చెప్పినట్టు వింటూ పొలం దున్ని కష్టపడి చచ్చిపోతాం అని మూర్ఖపు వాగ్దానం చేసెస్తారు. ఇన్ని సినిమాల్లో నటించినా డబ్బింగు గానీ, లిప్మూమెంట్ సరిగ్గా ఇవ్వడం గానీ చేతకాని ముఖేష్ రిషిని తండ్రిగా వేసుకొచ్చి ఫ్లాష్బాకులో హీరోని బెదిరించిన కామరాజు కూడా మారిపోతాడు. ఎం....తోపరిశోధన చేసి హీరోకి కావలసిన సమాచారం ఇచ్చి సారీ చెప్తాడు.

ఇంక చాలురా..మన సినిమాలో ఇరవై రీళ్ళు అయిపోయాయిరా..ఇంక ముగిద్దాం అన్నట్టు...హీరో ' రైతులని గౌరవించండి ' అని చెప్పడం ఆలస్యంఅందరూ ఇన్స్పైర్ అయిపోయి మొత్తం గ్రామం, దేశం మారిపోతుంది. ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా రైతుల గురించి కర్రికులంలో జతచేసేస్తారు. వీకెండ్ సినిమాలూ, సరదాలూ మానేసి దేశంలోని యువత అంతా "వ్యవసాయం " మొదలెట్టేస్తారు. 

ఇలాంటి సమీక్షలు ఏవీ వద్దు, మహేష్ బాబు ఉంటే చాలు అనుకునే వాళ్ళకి ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు.

ఫాన్సు "తప్పక చూడాల్సిన కళాఖండం" అని  మాత్రమే చెప్పగలను, చెప్పకపోయినా ఎలాగో చూస్తారు కాబట్టి!