చిన్నారికి ప్రాణం నిలిపిన మహేష్ బాబు

August 10, 2020

మహేష్ బాబు తన పెద్ద మనసు చాటుకున్నారు. ఒక చిన్నారి ప్రాణం కాపాడారు. తూర్పు గోదావరి జిల్లా తుమ్మల పల్లికి చెందిన ఒక పసికందుకు పెద్ద అపాయం వచ్చింది. ఒక అరుదైన గుండెజబ్బు కారణంగా చిన్నారి చావుకు దగ్గరగా వెళ్లింది.  రెండు నెలల్లో ఆపరేషన్ చేయకపోతే చిన్నారికి మరణం తప్పదు. 

చిన్నారి తల్లిదండ్రులు నాగజ్యోతి, ప్రదీప్ దంపతులకు పుట్టిన చిన్నారికి ఈ వ్యాధి సోకినా వారు స్తోమత లేక ఆపరేషన్ చేయించలేకపోతున్నారని తెలిసి మహేష్ ఆదుకున్నారు.

కొంతకాలంగా అవసరమైన చిన్నారులకు మహేష్ అండగా నిలుస్తున్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిసి మహేష్ బాబు ఈ పనిచేస్తున్నారు. తాజాగా మరో చిన్నారికి తన శక్తి మేర సాయం చేసి జీవం పోశారు. విజయవాడలో శస్త్రచికిత్స చేశారు. తమ బిడ్డను కాపాడిన మహేష్ బాబు సాయాన్ని ఎన్నటికీ మరిచిపోమని నాగజ్యోతి పేర్కొంది. మహేష్ బాబు రియల్ హీరో అని తండ్రి ప్రదీప్ కీర్తించారు. 

నమ్రత పోస్ట్ :

Yet another success story with the team at Andhra hospital!! Really appreciate the doctors helping people in the hour of need even during such troubled times, taking care of these babies and giving them a life worth living. Extremely happy to know that the child has recovered and is ready to be discharged from the hospital. Blessings to the boy and his family. Special thanks to Dr. PV Rama Rao, chief of Children’s Services & his team. Thank you once again for doing this.