వైవీ సుబ్బారెడ్డితో మహేష్ బాబు... ఏంటి కథ?

May 30, 2020
CTYPE html>
మహేష్ బాబు, కృష్ణలు రాజకీయాల్లో లేకపోవచ్చు గాని ఆ కుటుంబానికి మాత్రం రాజకీయ సంబంధాలు గట్టిగానే ఉన్నాయి. మహేష్ స్వయానా బావ గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీ రెండోసారి. టాలీవుడ్ నిర్మాతగా పలు సినిమాలు నిర్మించిన ఆదిశేషగిరి రావు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డితో మీటింగ్ అంటే... అదేదో రాజకీయ కలయిక అనుకునేరు. ఇది సాధారణ కలయికే. పైగా మహేష్ బాబుకు నేను రాజకీయాల్లో జీరోని అని అనేకసార్లు స్పష్టం చేశారు కూడా. 
ఇక పోతే తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా విజయాన్ని (?) ఎంజాయ్ చేస్తున్న టీం... ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వారికి వైవీ సుబ్బారెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మహేష్ బాబుతో కాసేపు ముచ్చటించారు. ఆ ఫొటోలే ఇవి.