మహేష్ బాబు సంచలన కామెంట్స్! 

May 26, 2020

అనుకునేది వేరు. జరిగేది వారు. మేము అందరు ( అగ్రహీరోలు ) ఒక ప్రత్యేక జోన్ లో పడిపోయాం. ప్రయోగాలు చేయలేకపోతున్నాం. మా చేతుల్లో ఏం లేని పరిస్థితి అని సూపర్ స్టార్  మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పలు ప్రయోగాలు చేసిన మహేష్ బాబు అవి డిజాస్టర్లు కావడంతో అటు హిట్టు రాక, అభిమానులకు నచ్చక, మార్కెట్ పడిపోయి.. ఇన్ని నష్టాలు అవసరమా? వద్దు. అందుకే అయిష్టంగా అయినా కమర్షియల్ ఫార్మాట్లో వెళ్దాం అన్న అర్థంలో మహేష్ బాబు కామెంట్లు చేశారు. వన్ నేనొక్కడినే మహేష్ చేసిన మంచి ప్రయోగాల్లో ఒకటి. కానీ అది మూడో షోకే డిజాస్టరు అని తేలి... టిక్కెట్ కొన్న ప్రేక్షకులు కూడా సినిమాకు రాకుండా పోయారు. కానీ సినిమాలో వస్తే... ఈరోజుకీ ఆ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ మధ్య అగ్రహీరోలు ప్రయోగాల జోలికి వెళ్లడం లేదు. అయితే... ఆ విషయాన్ని మహేష్ బహిరంగంగా కుండబద్దలు కొట్టేశారు.

ఇక తాజా సినిమా కోసం తాను 6 కిలోలు తగ్గినట్టు మహేష్ వెల్లడించారు. వాస్తవానికి తగ్గాలని అనుకోలేదని, తన క్యారెక్టరు ఆర్మీ అధికారి కావడంతో ఫిట్ ఉండటం కోసం 6 కిలోలు తగ్గినట్టు... దానివల్ల 1 నెల వృథా అయినట్టు మహేష్ చెప్పారు. ఎఫ్ 2 అనే సినిమా రిజల్టు చూశాక... ఎపుడో చేద్దామనుకున్న అనిల్ రావిపూడి సినిమా వెంటనే ఒప్పేసుకున్నట్టు మహేష్ చెప్పారు. అంటే ఆ సినిమా చూశాక దూరం పెట్టిన అనిల్ ని మహేష్ చేరదీశాడని అర్థమైందిగా ఇక్కడ. మహేష్ కేవలం కమర్షియల్ హీరో మాత్రమే కాదు. కమర్షియల్ మైండ్ కూడా. 

సెట్లో తన తీరు గురించి కూడా మహేష్ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఓకే చెప్పేవరకు సాధారణంగా ఉంటాను అని... ఒక్కసారి కథ ఓకే చెప్పాక.. దర్శకుడు ఏం చెబితే అది చేస్తానని, నేర్చుకోవడానికి నిరంతరం సిద్ధమని మహేష్ వెల్లడించారు. గతంలో ఎంత టాలెంట్ ఉందన్నది కాదు, కొత్తది నేర్చుకోవాలన్న తపన ఎక్కువ అన్నారు. కొత్తగా చేయడానికి అవసరమైన అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటాను అని మహేష్ అన్నారు.