ఆ ఫోన్ కాల్ కోసం మహేష్ బాబు వెయిటింగ్

May 26, 2020

తండ్రికి కొడుకు మీద, కొడుక్కి తండ్రి మీద ప్రేమ ఉండటం కామన్. అయితే మన వాళ్ల మీద ఇతరులు ఎవరైనా ప్రేమ చూపిస్తేనే ఎంతో ఆనందం వేస్తుంది. అలాంటిది మనకంటే ప్రముఖులు పెద్దవాళ్లు... ప్రేమ చూపిస్తే... కచ్చితంగా మెమొరబుల్. ఇపుడు అలాంటి ఆనందమే మహేష్ బాబుకు దక్కింది.

మెగాస్టార్ చిరంజీవి రేంజ్ తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు ఎవరుంటారు. సరయిన కథతో వస్తే... ఇపుడు కూడా రికార్డు బద్దలు కొట్టగలిగిన క్రేజ్ చిరంజీవిది. ఈ మధ్య చిరంజీవి అందరితో సఖ్యంగా ఉండటానికి మొగ్గు చూపుతున్నారు. మొన్నటి మహేష్ బాబు సినిమా ఫంక్షనుకు వచ్చిన చిరంజీవి... సూపర్ స్టార్ కృష్ణకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వాలని చేసిన వ్యాఖ్య మహేష్ ను మెప్పించింది. చిరంజీవి తన తండ్రి గొప్పదనం గురించి మాట్లాడటంతో ఉబ్బితబ్బిబ్బయిన అబ్బాయి... తండ్రి కృష్ణ వద్దకు వెళ్లి చిరంజీవి అన్న మాటలు చెప్పారట. ఈ విషయాన్ని మహేష్ షేర్ చేసుకున్నారు. 

ఇక చిరంజీవి... చాలా సానుకూలత శ్రద్ధతో ఉంటారని... నా ప్రతిసినిమాను చిరంజీవి చూసి కాల్ చేసి అభినందిస్తుంటారని... ఇపుడు కూడా తాను ఆ కాల్ కోసం ఎదురుచూస్తున్నట్టు మహేష్ బాబు చెప్పారు. జనవరి 12న ఆయన కాల్ వస్తుందని నాకు తెలుసు అన్నారు. ఎందుకంటారా... రేపు అంటే జనవరి 11న మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు విడుదల అవుతుంది గా. అందుకే చిరంజీవి ప్రశంసలు, ఫీడ్ బ్యాక్ కోసం మహేష్ వెయిటింగ్ ఇక్కడ.