`లూసిఫర్` డ్రీమ్ ప్రాజెక్ట్ కు ప్రిన్స్ ఆల్ ది బెస్ట్

August 08, 2020

`లూసిఫర్`తో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇపుడు `మరక్కార్`తో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన  'మరక్కార్: అరేబియా సముద్ర సింహం` ట్రైలర్ ను ప్రొడక్షన్ ప్లాట్ ఫాంలో మెగాస్టార్ చిరంజీవి, తన ఫేస్ బుక్ పేజీలో ద్వారా సోషల్ మీడియాలో రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ చిత్రం ట్రైలర్ ను హిందీలో అక్షయ్ కుమార్, కన్నడలో యశ్, తమిళంలో సూర్య రిలీజ్ చేశారు. పాన్ ఇండియా మార్క్ ఉన్న ఈ చిత్రం ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ కు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశాడు.

పోర్చుగీసువారిని తన రాజ్యంలో అడుగుపెట్టనివ్వకుండా నిలువరించే యోధుడు `కుంజాలీ` పాత్రలో మోహన్ లాల్ నటించాడు. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ మార్క్ సన్నివేశాలు ఈ చిత్రంలో కనిపించాయి. ఇక, తన డ్రీమ్ ప్రాజెక్టు 'మరక్కార్... అరేబియా సముద్ర సింహం' ద్వారా మోహన్ లాల్ కల నిజమైందని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. ఈ చిత్రానికి పని చేసిన తన సినిమాటోగ్రాఫర్ తిరుకు, చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపాడు మహేష్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'మరక్కార్...' లో మోహన్ లాల్ సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. అర్జున్, ప్రభు, సునీల్ శెట్టి, సుహాసిని వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటించారు. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ఓ కీలకపాత్రలో తండ్రితో పాటు నటించడం విశేషం.