క్వారంటైన్: మహేష్ బాబు రేర్ వీడియో

August 07, 2020

సెలబ్రిటీలకు కరోనా తమలోని కొత్త మనిషిని పరిచయం చేసింది. గంటకు లక్షలు ఛార్జి చేసే సినిమా టాప్ సెలబ్రిటీలు ఇంట్లో గడపడం తక్కువే. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయితే... తమ జీవితంలో ఊహించని రోజులను వారికి కరోనా రుచిచూపించింది. తమ జీవితంలో ఏనాడూ ఇంట్లో ఇంత సుదీర్ఘ సమయం గడుపుతామని వారు ఊహించి ఉండరు. పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి సెలబ్రిటీ ఇంటికే పరిమితం అయ్యి... ఇంట్లో వారికి బోలెడు సమయం కేటాయిస్తున్నారు. తమలోని అసలు మనిషి తామే చూసుకుంటూ మురిసిపోతున్నారు. పిల్లలు ఉన్నవారు వారితో ఆడుతూ హాయిగా సమయం గడిపేస్తున్నారు. తాజాగా రాజేంద్రప్రసాద్, బన్నీ, నాని చాలా మంది పిల్లలతో ఆడుతున్న వీడియోలు షేర్ చేశారు. తాజాగా ఇంట్లో కొడుకు గౌతమ్ తో వర్చువల్ టెన్నిస్ ఆడుతూ మహేష్ బాబు ఎంజాయ్ చేశాడు. ఆ వీడియోను షేర్ చేశాడు.