కూతురితో  లిప్ లాక్, కర్మ కాటేసింది

August 08, 2020

ఎవడి కర్మను వారు అనుభవించాల్సిందే. దీంట్లో డిస్కౌంట్లు ఉండవు. బాలీవుడ్లో సుశాంత్ సింగ్ మరణం కొందరు ప్రముఖ బాలీవుడ్ నటుల అసలు రూపాన్ని బయటపడేసింది. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక స్టార్ ఎదగడాన్ని ఏమాత్రం సహించని బాలీవుడ్ అక్కసే సుశాంత్ మరణానికి, డిప్రెషన్ కి కారణం అని ప్రపంచం కోడైకూస్తోంది.

ముఖ్యంగా నెటిజన్లు బాలీవుడ్ ప్రముఖులను వేటాడుతున్నారు. సుశాంత్ ని మీరంతా కలిసి కత్తి వాడకుండా చంపేశారు అంటోంది అభిమాన ప్రపంచం. సోనమ్ కపూర్, అలియాభట్ కొన్ని సందర్భాల్లో సుశాంత్ ఎవరోతెలియదు అని కామెంట్లుచేసి అవమానించడం జరిగింది. ఇక కరణ్ జోహార్ సినిమా వాళ్ల పిల్లలకు తప్ప వేరే వాళ్లకి అవకాశాలివ్వరని ఇపుడు అందరూ అతన్ని తిడుతున్నారు.

వీరందరికి మించి మహేష్ భట్ ఇరుక్కుపోయాడు. అతన్ను అందరూ బహిరంగంగా కామాంధుడు అంటున్నారు. దీనికి కారణం.. గతంలో మహేష్ భట్ కూతురితో లిప్ లాక్ చేసిన వీడియో చూపిస్తున్నారు. రియా చక్రవర్తి సుశాంత్ తో ప్రేమలో ఉండటం మహేష్ భట్ కి ఇష్టం లేదట. అది ఎంత పాపులర్ అయ్యిందంటే... స్వయంగా సుశాంత్ నువ్వు నాతో ఉంటే నన్ను మహేష్ భట్ చంపేస్తాడు అని రియాతో అన్నాడన్న వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

మహేష్ బట్ ఒక సందర్భంలో ఘోరమైన కామెంట్లు చేశాడు. ‘‘పూజా భట్ తన కూతురు కాకపోయి ఉంటే పెళ్లి చేసుకునేవాడిని‘‘ అని ఆయన చెప్పిన మాటలు విని ప్రపంచం విస్తుపోయింది. 

బహుశా తన కూతురి గురించి ఏ తండ్రి ఇలా అని ఉండడు. ఆ కామెంట్లు ప్రచురితమైన పత్రిక కవర్ పేజీపైనే కూతురితో లిప్ లాక్ ఫొటోముద్రించబడింది. దీంతో తాజాగా నెటిజన్లు కచ్చితంగా సుశాంత్ కేసులో మహేష్ భట్ ని విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. అతన్ని వదలకూడదని అంటున్నారు.

మరోవైపు సుశాంత్ మరణానికి కారణం బాలీవుడ్ లో ఉన్న బంధుప్రీతి కారణమన్న వాదనలు జోరందుకోవటమే కాదు.. స్టార్ హీరోయిన కంగనారౌనత్ ఓపెన్ గా చెప్పారు. బాలీవుడ్ లో వారసులకే ప్రాధాన్యం ఇస్తారని.. సుశాంత్ సూసైడ్ కు ఇదే కారణమన్న వాదనను ప్రజలు బలంగా నమ్ముతున్నారన్న విషయం తాజాగా పలువురు సెలబ్రిటీలను ఆన్ ఫాలో చేసిన తీరు చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది.

సుశాంత్ మరణం కచ్ఛితంగా హత్యేనంటూ విరుచుకుపడిన ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనారౌనత్ కు ఇన్ స్టాలో అమాంతంగా 20లక్షల మంది ఫాలోయర్స్ పెరిగారు.  కృతీ సన్ రియాక్ట్ అవుతూ.. తనలో సగ భాగాన్ని కోల్పోయినట్లుగా వ్యాఖ్యానించటంతో ఆమెను సుశాంత్ అభిమానులు నెత్తికెత్తుకున్నారు.

స్టార్ కిడ్స్ ను ప్రమోట్ చేసే దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు 2.5 లక్షల మంది ఆన్ ఫాలో అయ్యారు.  అలియాభట్ ను 5 లక్షల మంది ఆన్ ఫాలో చేశారు. సోనమ్ కూడా లక్షల్లో అన్ ఫాలో చేశారు.