మహేష్ బాబు భారీ విరాళం..

August 09, 2020

మంచి మనసు ఉంటే సరిపోదు. దానిని సరైన సమయంలో చూపాలి. టాలీవుడ్ సూపర్ స్టార్ గా పిలుచుకుంటున్న మహేష్ పవన్ బాటలో నడిచారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడానికి రూ. కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు సినీ నటుడు మహేష్ బాబు. మహేష్ బాబు ఈ స్థాయిలో విరాళం ప్రకటించడం అరుదైన విషయం. 

ఈరోజు ఉదయం పవన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రెండుకోట్ల విరాళాన్ని ప్రకటించడంతో మహేష్ కూడా పెద్ద అడుగు వేయకతప్పలేదు. అయితే... తప్పుకోవాలనుకుంటే 10-20 ఇచ్చినా ఎవరూ అడగరు గాని... మహేష్ మాత్రం ఉదారత చూపారు. ఒక్కో రాష్ట్ర ప్రభుత్వానికి 50 లక్షలు చొప్పున కోటి రూపాయలు ప్రకటించి శభాష్ అనిపించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టరులో ప్రకటించారు. 

విరాళం ప్రకటించడంతో విరాళాలు ఇవ్వడానికి అందరూ ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు మహేష్ బాబు. ప్రభుత్వాలు మనందరి కోసం ఎంతో శ్రమిస్తున్నాయి. ఇంట్లో ఉండండి. మీరు క్షేమంగా ఉండి అందరినీ క్షేమంగా ఉంచండి అంటూ మహేష్ కోరారు. మహేష్ ఉదారతను కొనియాడుతూ కేటీఆర్ అభినందనలు తెలిపారు. మహేష్ ట్వీటును రీట్వీట్ చేశారు.