ఆ ఒక్కడు రాజమౌళికి దూరంగా...

August 07, 2020

తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ దర్శకుడు ఎవరు అంటే తుడుముకోకుండా అందరూ రాజమౌళి పేరు చెబుతారు. ఆ తర్వాత త్రివిక్రమ్, కొరటాల, సుకుమార్, బోయపాటి, పూరి జగన్నాథ్, సురేందర్ రెడ్డి, యేలేటి... ఇంకా ఉన్నారు. కాకపోతే నెం.1 ప్లేస్ మాత్రం రాజమౌళికి దక్కుతుంది. తాజాగా కొద్దిరోజులుగా మహేష్ తో రాజమౌళి సినిమా అంటూ వస్తున్న రూమర్ ను ... అది రూమర్ కాదు నిజం అంటూ రాజమౌళి తేల్చేయడంతో... టాలీవుడ్ లో రాజమౌళి చేతిలో పడని టాప్ హీరోల్లో ఒక్క హీరో మిగిలిపోయాడు.

ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. అతను అల్లు అర్జున్ అని. అవును ఈ జనరేషన్ టాప్ తెలుగు హీరోలు మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ తదితరులున్నారు. (పవన్ సినిమాలు చేసినా... రాజకీయ నాయకుడిగానే చూడాలి). తాజాగా మహేష్ తో రాజమౌళి సినిమా కన్ ఫం కావడంతో.. రాజమౌళి టచ్ చేయని ఏకైక ప్రెజెంట్ తెలుగు హీరో అల్లు అర్జున్ మాత్రమే. వాస్తవానికి అల్లుఅర్జున్ మహేష్ కంటే బెటర్ గా రాజమౌళి కథలకు సూటవుతారు. కానీ కుదరలేదు. మిగతా అందరితో రాజమౌళి సినిమాలు చేశారు.

అయితే.. అల్లు అర్జున్ రాజమౌళితో సినిమాలు చేయకపోయినా... ఆల్మోస్ట్ అలాంటి జానర్ సినిమాలతో మంచి హిట్లు కొట్టేశారు. అలాంటి సినిమాల్లో సరైనోడు, రేసు గుర్రం చెప్పుకోవచ్చు. బలమైన హీరో క్యారెక్టర్... అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకునే సీరియస్ డ్రామా జానర్ సినిమాలు ఇవి. ఇవే కాకుండా అల్లు అర్జున్ తనను తాను ఎప్పటికపుడు తీర్చిదిద్దుకుంటూ వచ్చారు. సినిమా సినిమాకు తన గ్లామర్, ప్రెజెన్స్ పెంచుకుంటూ వచ్చాడు. తాజాగా వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాతో అల్లు అర్జున్ మరో మెట్టు ఎక్కుతాడు. 

ఇక రాజమౌళి విషయానికి వస్తే..  ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులతోనే రాజమౌళి 2024 వరకు బిజీగా ఉన్నాడు. కాబట్టి అల్లు అర్జున్ రాజమౌళి కాంబినేష్ అసలు నిజమవుతుందా లేదా? అన్నది తెలియదు. అవకపోయినా పెద్దగా నష్టమేం లేదని కూడా గుర్తించాలి.