మహేష్ బాబు కొత్త వ్యాపారం !!

August 15, 2020

సూపర్ స్టార్ కృష్ణ మిగతా వాళ్లందరికంటే ఎక్కువ క్రేజ్ సంపాదించి, ఎక్కువ డబ్బులు సంపాదించి... అన్నీ పోగొట్టుకున్నారు. ఆయన డబ్బు మనిషి కాదంటారు. దీంతో మహేష్ బాబు ఒకానొక సందర్భంలో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఒక పాపులర్ హీరో అయి ఉండి ఎవరికీ చెప్పుకోలేని ఆర్థిక ఇబ్బందులు అనుభవించారు మహేష్. అందుకే నమ్రత పరిచయమయ్యాక వారి స్నేహం పెళ్లిదాకా వెళ్లింది. అయితే, నమ్రత ప్రతి రూపాయి లెక్కించే మనిషి. మార్కెటింగ్ లో దిట్ట. అందుకే పెళ్లయ్యాక మహేష్ తన అన్ని ఆర్థిక వ్యవహారాలు ఆమెకే అప్పగించారు.
ఆమె ఈ వ్యవహారాలు చూడటం మొదలుపెట్టాక పలు బ్రాండ్లతో టైఅప్ అయ్యారు. ఆర్థికంగా స్థిరపడ్డాక. సినిమా నిర్మాణంలోకి అడుగు పెట్టారు. అక్కడితే ఆగలేదు. ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఇపుడు తాజాగా మహేశ్ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు.
తనకున్న బ్రాండ్ ఇమేజ్ ని సద్వినియోగం చేసుకుంటూ త్వరలోనే సొంత దుస్తుల బ్రాండ్ ను ప్రారంభించబోతున్నారు. వీటిని http://www.spoyl.in/mahesh-babu వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. ఈ విషయాన్ని మహేశ్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, మార్కెటింగ్ ఐడియా అదిరిపోయింది. తన బ్రాండ్ వినియోగదారులకు మహేష్ ను కలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే, అందరికీ కాదు. దీనికో పద్ధతి అనుసరిస్తారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే నటులు విజయ్ దేవరకొండ ‘రౌడీ’ పేరుతో ఇప్పటికే సొంత బ్రాండ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటీనటులు హృతిక్ రోషన్, సోనమ్ కపూర్, అనుష్కా శర్మ, దీపికా పదుకునే, సన్నీ లియోన్ తదితరులు కూడా క్లోత్ సెల్లింగ్ లో అడుగుపెట్టారు.