మోడీ జీవితంలో అతిపెద్ద స‌వాల్ ఇదే

April 02, 2020

బీజేపీలో ఏక‌చ‌త్రాధిప‌త్యంగా త‌న హ‌వాను కొనసాగిస్తున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ఈ ఎన్నిక‌లు విష‌మ ప‌రీక్ష వంటివేనా?కమలనాథులకు 2014తో పోల్చితే ఇప్పుడు సీట్లు తగ్గినా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని మళ్లీ వాళ్లే ఏర్పాటు చేసే అవకాశం ఉందనే ప్ర‌క‌ట‌న‌లోనే...మోడీకి అస‌లైన స‌వాల్ ఉందా? స‌ర్వేలు నిజ‌మైతే...బీజేపీ ర‌థ‌సార‌థి ఏ విధంగా వాటిని ఎదుర్కుంటారు? ఈ చ‌ర్చ ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. `సోలో షో`కు ఇష్ట‌ప‌డిన మోడీకి ఈ పొత్తుల ప‌రంప‌ర ఎలాంటి ఫ‌లితం చూపుతుంద‌ని అంటున్నారు.

ఐదేళ్ల కిందట బీజేపీ, ఎన్డీఏ ఊహించని రీతిలో బంపర్ మెజారిటీతో విక్టరీని నమోదు చేశాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కి చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో లోక్ సభలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశాయి. అయితే, రాబోయే ఎన్నిక‌లు ఆ పార్టీకి గ‌ట్టి స‌వాల్ వంటివని అంటున్నారు. విశ్లేష‌కుల అంచ‌నా ప్ర‌కారం, ప్రస్తుతం బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూలంగా మారుతుంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో లక్షల సంఖ్యలో జాబులు పోవటం, ఎన్డీయేలోని కొన్ని మిత్ర పక్షాలు జారుకోవటం మైనస్ పాయింట్లే . ఈ ట్రెండ్ కి అద్దం పట్టేలా ఇటీవల కొన్ని రాష్ట్రాలు బీజేపీ చేజారాయి. గతేడాది చివరలో గుజరాత్ లో చావుతప్పి కన్ను లొట్టబోయింది. వివిధ రాష్ట్రాల్లో హస్తం పార్టీ పుంజుకుంది. ఇవ‌న్నీ...క‌మ‌ల‌నాథుల క‌ష్టకాలానికి తార్కాణ‌మ‌ని అంటున్నారు.

ఇక ఆయా పార్టీల స‌ర్వేలు సైతం షాక్ క‌లిగించే రీతిలో ఉన్నాయి. సీఎస్డీఎస్ –లోక్ నీతి సర్వేలో బీజేపీ ఓటు షేరు నాలుగు శాతం పెరగొచ్చని తేలినా ఆ పార్టీకి 222–232 సీట్లే వస్తాయని అంచనా వేసింది. ఎన్డీఏ బలం 263–283 వద్దే ఉండొచ్చట. సీ ఓటర్స్ సర్వే ప్రకారం కూడా ఎన్డీఏ గెలిచే స్థా నాల సంఖ్య 233 మాత్రమేన‌ని పేర్కొంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కమలనాథులు సొంతంగానే 283 సీట్లు సాధించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ఏకంగా 336 స్థా నాల్లో విజయం సా ధించింది. లోక్ సభలో మొత్తం సీట్లు 543 కాగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎంపీల సంఖ్య 272. అంటే సంకీర్ణ స‌ర్కారే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మరి, కేంద్రంలో సంకీర్ణ సర్కార్ అంటూ ఏర్పడితే దాన్ని మోడీ నడపగలరా అనే సందేహం తెర‌మీద‌కు వస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఇన్నాళ్లూ ఆయన వన్ మ్యాన్ షో చేశారు. రాష్ట్ర అసెంబ్లీ లో కమలదళం ఎప్పుడూ ఫుల్ మెజారిటీతో కంఫర్టబుల్ జోన్ లోనే ఉండేది. దీంతో అటు గుజరాత్లో గానీ ఇటు కేంద్రంలో గానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరం, నడిపిన అనుభవం మోడీకి ఎప్పుడూ రాలేదు. రాబోయే కాలంలో ఆ ప‌రిస్థితి ఖాయ‌మైతే సంకీర్ణ ప్రభుత్వాన్ని మిత్ర పక్షాలు కంట్రోల్ చేయటానికి చూస్తే ఎలా డీల్ చేస్తారన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది.

గుజరాత్ ముఖ్యమంత్రిగా పుష్కర కాలానికి పైగా పనిచేసిన మోడీ గోద్రా అల్లర్ల వల్ల మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా తర్వా త పదేళ్లు తన హవా కొనసాగించారు. కేంద్రంలో పేరుకే అలయెన్స్ ప్రభుత్వం ఉన్నా పెత్తనమంతా బీజేపీదే. ఆ పార్టీ చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లు నడిచింది. ప్రధానిగా మోడీకి ఇది ఫస్ట్ టర్మే అయినా ప్రభుత్వంలో ఆయనకు ఎదురే లేకుం డాపోయింది. పార్టీలోనూ మోడీది తిరుగులేని డామినేషనే. మిత్రుడు అమిత్ షాతో కలిసి స్వపక్షంలో ఎలాంటి విపక్షమూ లేకుండా మెయింటెయిన్ చేశారు. అయితే, సంకీర్ణ స‌ర్కారులో ఇలాంటి ప‌రిస్థితి క‌ష్ట‌మే. ఎందుకంటే కేంద్ర కేబినెట్ లో వేరే పార్టీ మంత్రులు ఉంటే వాళ్లు ముందుగా తమ ప్రయోజనాలే నెరవేరాలని ఆశిస్తారు. వాళ్లకంటూ కొన్ని సొంత అజెండాలు ఉంటాయి. వాటికి సాధ్యమైనంత త్వరగా ఆమోద ముద్ర వేయించుకోవాలని చూస్తారు. ఏమాత్రం తటపటాయించినా, ఆలస్యం చేసినా, వ్యతిరేకించినా వెంటనే రియాక్షన్ ఇస్తారు. ప్రభుత్వ పరిపాలన వన్ మ్యా న్ ఆర్మీలా, ఈజీగా సాగకపోవచ్చు.ఫలితంగా జాతీయ రాజకీయాల్లో బలమైన నేతగాముద్రపడిన మోడీ ఇమేజ్ కు కొంత డ్యా మేజ్ జరగొచ్చు. ఈ ప‌రిస్థితిని ఎదుర్కోవ‌డం...మోడీకి విష‌మ‌ప‌రీక్షే అంటున్నారు.