ఏయ్ నోర్ముయ్, నాలుక కోస్తా - లైవ్ లో మహిళపై వైసీపీ ఎమ్మెల్యే

February 22, 2020

దిశ చట్టం తెచ్చి కొన్ని రోజులు కాలేదు. ఈరోజు దిశ అమలుపై జగన్ సమీక్ష కూడా చేశారు. కానీ ఒక వైసీపీ ఎమ్మెల్యే బీసీ మహిళను టీవీ డిబేట్ లో ఉండగా... లైవ్ లోనే ఏయ్ నోర్ముయ్, లోపలేయిస్తాను, నాలుక కోసేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరి దిశ చట్టం కింద ఈ మంత్రిని బుక్ చేస్తారా? ఎవరా ఇద్దరు అనుకుంటున్నారా?

బాధితురాలు - టీడీపీ నేత పంచుమర్తి అనురాధ

బూతులు తిట్టిన వ్యక్తి - మల్లాది విష్ణు (ఈయన బార్ లోనే సారా తాగి గతంలో పేదలు చనిపోయింది)

బహిరంగంగా టీవీ ఛానెల్లలోనే వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడతామంటూ స్వయంగా చెబుతున్నారు. లోపలేయిస్తా అంటున్నారు. ఆ మాట ఎందుకన్నారో తెలుసా. గతంలో మల్లాది విష్ణు బార్లో జరిగిన సంఘటనను ఆమె గుర్తుచేయడంతో ఊగిపోయారు మల్లాది విష్ణు. ఈయన చంద్రబాబును ఊసరవెల్లి అని సంబోధించడంతో అనురాధ రిప్లయి ఇచ్చారు. ఎమ్మెల్యే గారూ... గూగుల్ లో ఊసరవెల్లి అని సెర్చ్ చేస్తే చంద్రబాబు పేరు రాదు. కానీ ఖైదీ నెం.6093 అని వెతికితే మీ అధినేత జగన్ పేరు వస్తుంది. ఆంధ్ర 420 అని వెతికితే మళ్లీ మీ అధినేత పేరే వస్తుంది. దీంతో ఎమ్మెల్యే విష్ణు మండిపోయారు. ఊసరవెల్లి అనే పదం వాడకపోతే అనురాధ ఇలాంటి రిప్లయి ఇచ్చేదే కాదు. కానీ ఎమ్మెల్యే విష్ణు రెచ్చగొట్టి మరీ తన పాత చరిత్రను తవ్వించుకున్నారు. 

ఆడదానివని చూడను, కార్పరేటర్ స్థాయికి సరిపోవు ముఖ్యమంత్రిని అంటావా? అని మల్లాది ఆమె తిడుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రిని విమర్శించాలంటే... అతను ఒప్పు చేశాడా? తప్పు చేశాడా? అన్నది పాయింట్ గాని ఆమె పాపులరా? కాదా? అన్నది చూడకూడదు ఎమ్మెల్యే గారు. వాస్తవాలు చెబితే అంత ఉలికిపాటు ఎందుకు అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.