నోరు జారిన మమత... దేశమంతా తిడుతోంది

July 08, 2020

మమతా బెనర్జీ... ఇండియాలో ఒక స్పెషల్. నిరాడంబర వనిత. పవర ఫుల్ మహిళ. మోడీకి తలొగ్గని బెంగాల్ పులి. చాలా మందికి దేశంలో ఆమెపై సాఫ్ట్ కార్నర్ ఉంది. మోడీ అభిమానుల్లో కూడా కొందరు ఆమె అభిమానులు ఉన్నారు. అయితే...ఆమె కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేసినా ఎవరూ తప్పు పట్టలేదు కానీ ఈరోజు ఆమె చేసిన వ్యాఖ్యలతో మమతపై జనంలో ఇమేజ్ భారీగా పడిపోయింది. మోడీని విమర్శించబోయి తాను బొక్కబోర్లా పడింది. అయితే... ఈ విషయం ఇంకా ఆమెకు అర్థం కాలేదు.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారతదేశం ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన చంద్రయాన్-2 ల్యాండింగ్ కోసం ఇండియాతో పాటు ప్రపంచమంతటా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చంద్రయాన్ 2 ప్రాజెక్టు విలువను తగ్గించేలా మాట్లాడారు. మోడీపై ఆమెకు ఎంత కోపమైనా ఉండొచ్చు గానీ... ఈ విషయంలో మాత్రం మమత ప్రజల మద్దతు కోల్పోయింది. దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి అందరి దృష్టి మరల్చేందుకు చేసిన ప్రయత్నమే చంద్రయాన్-2 అని ఆమె పొంతన లేని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి చంద్రయాన్ 2 అనేది సీక్వెల్ ప్రయోగం. ఇది భారతీయులకు గర్వకారణం. ఉదయం నుంచి ప్రపంచమంతటా భారత్ టాలెంట్ ను కొనియాడుతోంది. కానీ మమతకు మాత్రం కళ్లు మూసుకుపోయాయి.

ఆమె కేవలం ఒక్క మాటతో ఆగిపోలేదు. చాలా దారుణంగా మాట్లాడారు. ’ఇలాంటి ప్రయాసతో కూడుకున్న ప్రాజెక్టులను గత ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రయాన్ వంటి భారీ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఇవి ఖర్చు ఎక్కువ. ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ మైలేజీ కోసం పాకులాడే బదులు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి‘‘ అన్నారు. ఇక సీఎం స్థాయి వ్యక్తి చేసిన వ్యాఖ్యలు భారతీయుల అనైక్యతపై లేనిపోని అనుమానాలు కల్పించాయి ప్రపంచానికి. సింపుల్ గా చెప్పాలంటే... ఇపుడు తీస్తున్న భారీ సినిమాల బడ్జెట్ కంటే ఈ ప్రాజెక్టు ఖర్చు తక్కువే. ఇలాంటివి విజయవంతం అయిన కొద్దీ దేశం విలువ అంతర్జాతీయంగా పెరుగుతోంది. ఈ కనీస అవగాహన లేకుండా మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యలు అందరూ నోటి మీద వేలేసుకునేలా చేశాయి. పైగా ఇంత పెద్ద సందర్భంలో... గతంలో హోం మంత్రిగా పనిచేసిన చిదంబరాన్ని అరెస్టు చేస్తారా అంటూ... మాట్లాడి ఇంకా చులకన అయిపోయింది.