థాంక్యూ చంద్రబాబు అండ్ టీం...

May 21, 2019

బీజేపీ పొగరును కుంభ స్థలం మీద కొట్టి అణిచేస్తున్న ఏకైక సింహం మమతా బెనర్జీ. రాష్ట్రంలో తనను తాను నియంతలా ఫీలయ్యే కేసీఆర్ వంటి వాళ్లు కూడా ఢిల్లీకెళ్లి మోడీకి మోకరిల్లుతుంటే... కోల్ కతా కాళీ మాత మానవ రూపంలో గర్జించి బీజేపీ గూండాల తోలు వలుస్తోంది మమతా బెనర్జీ. ఒక ప్రధాని, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, వేలాది గూండాలు... వచ్చినా కూడా మమత బెనర్జీ కళ్లలో భయం ఈసీ ని అడ్డం పెట్టుకుని తోక ముడిచారు బీజేపీ శ్రేణులు.
42 సీట్లున్న మహా బెంగాల్ సామ్రాజ్యంలో నరేంద్రమోడీ హవాను రాష్ట్రంలో వీయకుండా అడ్డుకున్న మహా జ్వాల మమతా బెనర్జీ. ఒక స్త్రీపై గెలవడానికి మొత్తం మంద మొత్తం కదలివచ్చినా ఆమె తగ్గలేదు. చివరకు ఇంతవరకు లేనంత దారుణంగా రాజ్యాంగ చట్టాన్ని అడ్డుకుపెట్టుకుని బతికి బట్టకట్టాయి బీజేపీ శ్రేణులు. ఈ పోరాటంలో మమతా బెనర్జీకి పూర్తి స్థాయిలో అండగా నిలిచిన వ్యక్తి చంద్రబాబు మరియు ఆయన కూటమి. ఈసందర్భంగా తనకు పూర్తిగా మద్దతు పలికిన చంద్రబాబుకు మమతా బెనర్జీ ట్విట్టరు ద్వారా కృతజ్ఝతలు తెలిపింది.
ఇది మమత ట్వీట్.
Thanks and gratitude to @Mayawati, @yadavakhilesh, @INCIndia, @ncbn and others for expressing solidarity and support to us and the people of #Bengal. EC's biased actions under the directions of the #BJP are a direct attack on democracy. People will give a befitting reply

మాయావతి, అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ లతో పాటు చంద్రబాబు కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీజేపీకి మే 23న పెద్ద గుణపాఠం ఎదురవుతుందని ఆమె వ్యాఖ్యానించింది.
అయినా బెంగాల్ పై పట్టుకోసం బీజేపీ ఎందుకు ఇంత తాపత్రయ పడుతుందంటే... గతంలో గుజరాత్, రాజస్తాన్, యూపీ, మధ్యప్రదేశ్ లలో బీజేపీకి చాలా సీట్లు వచ్చాయి. ఈసారి అక్కడ భారీగా సీట్లు తగ్గుతున్న నేపథ్యంలో అక్కడి లాస్ ను కవర్ చేసుకోవడానికి బెంగాల్ మీద దృష్టి పెట్టింది మోడీ - షా ద్వయం. మరి ప్రజలు ఎలా స్పందించారో, బీజేపీని ఎంత మేర తిప్పికొట్టారన్నది మే 23వరకు వేచిచూడాల్సిందే.