మోడీ ఫోను ఎందుకు రిసీవ్ చేసుకోలేదంటే...

May 24, 2020

మోడీకి మమత అంటే... ఫ్రస్ట్రేషన్, మమతకు మోడీ అంటే లైట్. ఇది బెంగాల్లో పరిస్థితి. తాజాగా ఫణి తుపానుపై ప్రధాని మోదీ బెంగాల్, ఒడిసా ముఖ్యమంత్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మమతా బెనర్జీ కనీసం ఫోన్ ఆన్సర్ కూడా చేయలేదట. దీనిపై ఆమెను ప్రశ్నిస్తే... మోడీ కాలం చెల్లిన ప్రధాని అన్నారు. అతనితో వేదిక పంచుకోనూలేను, ఆయన ఫోను ఎత్తాల్సిన అవసరమూ లేదు అంటూ ఆమె వ్యాఖ్యానించింది.
మోదీ పదవీకాలం ముగిసిపోయిందని... మళ్లీ ఆయన ప్రధాని కావడం ఒక తీరని కల. ప్రధాని నాకు ఫోన్ చేశాడు. నేను ఆ సమయంలో ఖరగ్ పూర్ లో ఉన్నా. తుపాను పరిస్థితులను సమీక్షిస్తున్నాను. అదే సమయంలో మోదీ మాత్రం ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. మోదీ ప్రభుత్వం ఇచ్చే తుపాను సాయం అవసరం మాకు లేదు. అయినా మోడీవి ఒట్టి హామీలే. గతంలో తుపాన్లు వచ్చినప్పుడు పశ్చిమబెంగాల్ కు మోదీ చేసిన సాయం ఏం లేదు. హిస్టరీ చదివితే తెలుస్తుంది అన్నారామె.