అమెరికా ఫ్రీ సీటు గెలిచిన తెలంగాణ అమ్మాయి 

August 13, 2020

ఒకప్పుడు బ్రిటిష్ రవి అస్తమించని సామ్రాజ్యం.

కానీ ఇపుడు తెలుగు వారిది రవి అస్తమించని సామ్రాజ్యం.

అంటే ప్రపంచంలో తెలుగు వారు విస్తరించని ప్రాంతమే లేదు. 

మన వాళ్లు అన్నింటా సత్తా చాటుతూ పైపైకి ఎదుగుతున్నారు.

తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ అండ్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్ కి చెందిన సూర్యదీపిక అనే విద్యార్థిని అమెరికాలోని ప్రఖ్యాత అబర్న్‌ యూనివర్సిటీ (Auburn University )లో అడ్మిషన్‌ దక్కించుకుంది. తాజాగా మరో విద్యార్థిని ఆ వర్సిటీలో సీటు దక్కించుకుంది. 

మంచిర్యాలకు చెందిన సుహర్ష (Suharsha) ఎమ్మెస్సీ (wood science and technology) ఉచిత సీటు దక్కించుకుంది. తండ్రి సింగరేణి ఉద్యోగి. ఆమె టాలెంట్ ను గుర్తించి సుహర్షకు ట్యూషన్‌ ఫీజు రూ.22.5 లక్షలు మినహాయిస్తూ వర్సిటీ నిర్ణయం తీసుకుంది. తిరిగి ఆమెకే నెలకు లక్ష 12 వేల రూపాయలు చొప్పున రెండేండ్ల పాటు స్కాలర్‌షిప్‌ కూడా ఇస్తామని ప్రకటించింది.

సూర్యదీపిక, సుహర్ష ప్రస్తుతం ఫారెస్ట్‌ కాలేజీలో ఫైనలియర్‌ చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఈ విద్యార్థినులు ఈ స్థాయిలో రాణించడం ఆ తల్లిదండ్రుల అదృష్టం, ఫ్యాకల్టీ ప్రోత్సాహం అని చెప్పాలి. 

RELATED ARTICLES

  • No related artciles found