జబర్దస్త్ పై మంచులక్ష్మి దారుణమైన కామెంట్లు ?

August 04, 2020

మగాళ్లు ఆడవాళ్ల వేషాలు వేసుకుని ఆడవాళ్లపై కామెంట్లు చేసే తెలుగు షో ఏది ?

ఈ ప్రశ్న ఏ తెలుగు వారిని అడిగినా... వచ్చే సమాధానం జబర్దస్త్ !!

అయితే.. మంచు లక్ష్మి చేసిన కామెంట్లు కచ్చితంగా జబర్దస్త్ గురించే అనుకోవాలి. 

టీవీ9 కు తెలుగు నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఓ తెలుగు షోపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె ఏ షో పేరు తన నోటితో పలకలేదు గాని తను ఇచ్చిన హింట్ ప్రకారం ఆమె కామెంట్లు జబర్దస్త్ గురించే అని సోషల్ మీడియా చర్చ సాగుతోంది.

ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే... ’కొన్ని టీవీ షోలలో మగవారు ఆడవారి వేషాలు వేసుకుని నటిస్తారు. అవి నాకు చాలా అగ్లీగా అనిపిస్తాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. మగవాళ్లకు ఆడవాళ్ల వేషాలు వేయడం ఏంటి? వారు ఆడవారి గురించి దారుణమైన కామెంట్లు చేయడం ఏంటి? అందులో ఏం  హాస్యం ఉంటుంది? హాస్యం లేకపోగా ఇవన్నీ అసహ్యకరంగా ఉంటాయని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి షోల అవసరం ఏంటో తెలీదన్నారు.

అయితే... మంచు లక్ష్మికి తనకిష్టమైన అభిప్రాయం ఉండటంలో తప్పులేదు గాని వాటిని తన ఇష్టానుసారం ప్రశ్నించడం, తన అభిప్రాయమే జనాభిప్రాయం అనే భావనతో చెప్పడం విచిత్రం. అసలు తెలుగు వారిలో మంచు లక్ష్మి షోలపై కూడా అభిప్రాయం తెలుసుకుంటే మంచిదేమో.