మంచు విష్ణు రూ. కోటి విరాళం... ఎవ‌రికి?

May 25, 2020

నోటి దూలతో అంద‌రినీ కెలుకుతుంటారు గాని మంచు ఫ్యామిలీ మ‌న‌సు మంచిదే. గ‌తంలో కొన్ని సార్లు ఇది ప్రూవ్ అయ్యింది. తాజాగా ఆ కుటుంబం మ‌రో మంచి ప‌నికి శ్రీ‌కారం చుడుతోంది. గ‌తంలో ల‌క్ష్మీ మంచు టీవీ షోల ద్వారా చాలామందికి సాయం చేసింది. మోహ‌న్ బాబు కూడా విద్యా రంగంలో వ్యాపారంతో పాటు, కొంచెం సేవ కూడా చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా ఆ ఇంట్లో మ‌రో వ్య‌క్తి ఇంకో మంచి ప‌నికి శ్రీ‌కారం చుట్టారు.
ప్ర‌ముఖ‌ న‌టుడు మోహ‌న్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న కుమారుడు, న‌టుడు మంచు విష్ణు ఒక గొప్ప నిర్ణ‌యం తీసుకున్నారు. రాబోయే మూడేళ్ల‌లో తిరుప‌తి రుయా ఆస్ప‌త్రికి రూ.కోటి విరాళం ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈరోజు తొలి విడ‌త నిధులు కేటాయించారు. వారే స్వీయ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వీటిని వినియోగించ‌నున్నారుట‌.
మంచు వారి విరాళంతో రుయా ఆస్ప‌త్రి చిన్న పిల్ల‌ల విభాగంలో న‌వ జాత శిశువుల ఐసీయు, పీడియాట్రిక్ ఐసీయు నిర్మించ‌నున్నారు. వీటితో పాటు ఎమ‌ర్జెన్సీ అవుట్ పేషెంట్ బ్లాక్ కూడా నిర్మించ‌నున్నారు. ఈ మూడింటికి రాబోయే మూడేళ్ల‌లో కోటి రూపాయ‌లు ఖ‌ర్చుపెడ‌తాన‌ని మంచు విష్ణు త‌న ట్విట్ట‌రులో తెలిపారు. అత‌ని నిర్ణ‌యానికి సోష‌ల్ మీడియా సెల్యూట్ చేస్తోంది. చాలామంది సంపాదిస్తారు గాని ఇలా కొంచెం స‌మాజానికి కేటాయించ‌డం మ‌న ధ‌ర్మం అని గుర్తించే వారు త‌క్కువ‌మందే ఉంటారు.

https://twitter.com/iVishnuManchu/status/1107909983163670528