లోకేష్ నియోజకవర్గం మంగళగిరి​లో విధ్వంసం

May 29, 2020

వలస కూలీల విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండూ విఫలం అయ్యాయి. వారిని గుర్తించడంలో, సదుపాయాలు కల్పించడంలో, క్షేమంగా చూసుకోవడంలో స్థానిక  ప్రభుత్వాలు విఫలమైతే.. వారికి భద్రత లేకుండా ఉన్నచోట ఉండమని... 43 రోజుల ఆలస్యంగా వారిని తరలించే నిర్ణయం తీసుకుని కేంద్రం విఫలమైంది. మొత్తానికి వారి బాధ అర్థం చేసుకున్నది ఒక్క కేరళ మాత్రమే.

ఏపీ సర్కారు అయితే వారిని గాలికి వదిలేసింది. మొన్న గోదావరి జిల్లాలో తమను ఇంటికి పంపమని అడిగిన పాపానికి లాఠీ చార్జి చేశారు పోలీసులు. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో 3 వేల మంది వలస కార్మికులు మమ్మల్ని ఊరికి పంపండి అంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. మంగళగిరిలోని ఎయిమ్స్ వద్ద వారు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో విధ్వంసం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడ్రెస్ లేరు. వారి గురించి పట్టించుకోలేదు. ఈ సందర్భంగా వారి ఆగ్రహానికి ఎయిమ్స్ లో ఫర్నీచర్, కొన్ని గదులు ధ్వంసం అయ్యాయి.

మంగళగిరి అదనపు ఎస్పీ ఈశ్వర్ రావు వలస కార్మికులకు సర్దిచెప్పడానికి ప్రయత్నం చేశారు. గుంటూరు జిల్లా రెడ్ జోన్ లో ఉండటం.. కేసులు ఎక్కువగా ఉండటం వల్ల పంపలేకపోతున్నామని వివరించారు. తాము లాక్ డౌన్లో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాం మా ఊరికి పంపండి అని వారు వేడుకున్నారు. ఏపీ సర్కారు... కనీసం వారు తిండికి, ఆవాసానికి కూడా భరోసా ఇవ్వకపోవడం దారుణం. కింద అక్కడ జరిగిన విధ్వంసం వీడియో చూడొచ్చు. 

video link: మంగళగిరి ఎయిమ్స్ విధ్వంసం