పోస్టరు చూశారా... పాపం మన్మథుడు !!!

February 23, 2020

‘మన్మథుడు’ సినిమాలో మహిళల్ని భలేగా ఏడిపించేస్తుంటాడు నాగార్జున. ఓపెనింగ్ సీన్లోనే ఒక లేడీ వచ్చి అడ్రస్ అడిగితే.. తెలిసినా చెప్పనంటాడు. తర్వాత ఆఫీసులో అమ్మాయిలకు ఎలా చుక్కులు చూపిస్తాడో.. ఆపై అసిస్టెంట్ మేనేజర్ హారికను ఎలా ఏడిపిస్తాడో తెలిసిందే. దీని వెనుక రీజన్ ఏదైనా సరే.. అమ్మాయిల్ని అభి పెట్టే టార్చర్ మాత్రం అన్ బేరబుల్. ఐతే ‘మన్మథుడు-2’కు వచ్చేసరికి సీన్ రివర్స్ అయినట్లుంది. నాగార్జుననే రివర్సులో లేడీస్ అంతా కలిసి ఆడేసుకుంటారేమో అనిపిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ అవే సంకేతాలిస్తోంది. నాగ్ చేతులు బిగబట్టి పళ్లు కొరుకుతూ ఫ్రస్టేట్ అయిపోతుంటే.. వెనుక పకపకా నవ్వుతున్న లేడీస్ కనిపిస్తున్నారు. వెనుక ఉన్న బ్యాచ్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్‌తో పాటు లక్ష్మి, ఝాన్సీ, ఇంకో ఇద్దరు మహిళలు ఉన్నారు. మొత్తానికి వీళ్లంతా కలిసి సినిమాలో నాగార్జునను టార్చర్ పెట్టేలాగే కనిపిస్తున్నారు. గత నెలలో రిలీజైన ‘మన్మథుడు’ టీజర్ ఎంటర్టైనింగ్‌గా అనిపించినా.. అడల్ట్ కంటెంట్ డోస్ ఎక్కువైందని.. ‘మన్మథుడు’ తరహాలో క్లీన్ మూవీ కాదని.. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చడం కష్టమని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బోల్డ్ కంటెంట్ డోస్ తగ్గించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీర్చిదిద్దుతున్నాడని వార్తలొస్తున్నాయి. తాజా పోస్టర్ అయితే ఫ్యామిలీస్‌కు కూడా నచ్చేలా కనిపిస్తోంది. నాగ్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.